Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ కోసం బలి?? ఛ ఛ ఆపండి

By:  Tupaki Desk   |   19 Jan 2016 10:42 PM IST
ఎన్టీఆర్‌ కోసం బలి?? ఛ ఛ ఆపండి
X
స్టార్ హీరోలకు ఫ్యాన్స్ చాలా మందే ఉంటారు. తమ అభిమానాన్ని చాలా రకాలుగా ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు. స్టార్ల పుట్టిన రోజున రక్త దానాలు చేయడం, అన్నదానాలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. కానీ అభిమానం శృతి మించితేనే అసలు సమస్య వస్తుంది.

ఓ జుగుత్సాకరమైన సంఘటన ఒకటి లేటుగా వెలుగులోకి వచ్చింది. నాన్నకు ప్రేమతో రిలీజ్ రోజున ఓ అభిమానుల గ్రూప్ ఏకంగా బలి కార్యక్రమం నిర్వహించారు. జంతు బలి మన దేశంలో నిషేధం అయినా, అక్కడక్కడా కొన్ని గుళ్లలో జరుపుతూనే ఉన్నారు. ఇక్కడ తమ హీరోని దేవుడిగా భావించడమే కాదు, ఏకంగా ఓ మేకను బలిచ్చేశారు కూడా. అది కూడా పబ్లిక్ గా చుట్టూతా చాలా మంది ప్రజలు చూస్తుండగానే బలి కార్యక్రమం నిర్వహించారు. ఇంత క్రూరంగా అభిమానులు ప్రవర్తించడం చాలా హేయమైన పని అని చెప్పాలి.

ఈ ఘోరాన్ని వీడియోలో చూసిన జూనియర్ ఎన్టీఆర్.. చాలా బాధపడ్డాడని తెలుస్తోంది. అసలు ఏ హీరో కూడా ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడు. తాము తల ఎత్తుకునేలా తమ అభిమానులు ప్రవర్తించాలని ఏ హీరో అయినా కోరుకుంటాడు. అభిమానులు కూడా బాధ్యతగా ప్రవర్తించి, తమ అభిమాన హీరోకి గౌరవం అపాదించేలా చూడాలి కానీ. ఇలా వాళ్లను మనసులను గాయపెట్టి, బాధపెట్టే పనులు చేయకూడదు. ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అభిమానులు దూరంగా ఉండాలని స్టార్లు అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. అభిమానులూ.. ఈ హేయమన పనులు ఆపండయ్యా!!