Begin typing your search above and press return to search.

క్లారిటీ కావాలంటున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   13 April 2019 10:49 AM IST
క్లారిటీ కావాలంటున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్
X
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడింది కానీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఎవరికి లేని టెన్షన్ మాకెందుకు అంటూ రాజమౌళిని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. డైసి తప్పుకున్నాక తారక్ సరసన హీరోయిన్ ని ఇంకా సెట్ చేయలేదు. ఒకపక్క నిత్య మీనన్ ని తీసుకున్నారంటూ ప్రచారం హోరెత్తిపోతోంది. మూడేళ్ళ క్రితమే సెకండ్ హీరోయిన్ వేషాలకు వచ్చిన నిత్యను ఇంత భీకరమైన ఫామ్ ఇమేజ్ ఉన్న జూనియర్ పక్కన ఎలా తెస్తారంటూ లోతుగా ఆలోచించలేని కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి నిత్య మీనన్ ను తీసుకున్నా రాజమౌళి తనను తారక్ పక్కన జోడిగా సెట్ చేయడు. వేరే ఏదైనా పాత్ర ఉంటుంది. అంతే తప్ప చిన్న లీక్ బయటికి రావడం ఆలస్యం దాని మీద ఇన్నేసి కథనాలు వండటం భావ్యం కాదు. చాలా కీలకమైన ఈ ఎంపికను రాజమౌళి లైట్ తీసుకునే రకం కాదు. ఎలాగూ నెల రోజుల గ్యాప్ దొరికింది కాబట్టి ఈ వ్యవధి చాలు ఇంకో హీరోయిన్ ని సెట్ చేసుకోవడానికి.

కథ ప్రకారం విదేశీ వనిత అన్నారు కాబట్టి ఆ పోలికలు ఉన్న బాలీవుడ్ బ్యూటీనో లేదా ఇంకో ఇంగ్లీష్ పోరినో తీసుకురావాలి. మనమే ఇంతగా ఆలోచిస్తున్నాం అంటే జక్కన్న బుర్ర ఏ రేంజ్ లో పరుగులు పెడుతుంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. కాకపోతే ఇప్పటికిప్పుడు క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు ఇంకో నెలలో ఇదుగో మీ హీరోయిన్ అంటూ ఖచ్చితంగా పరిచయమైతే చేస్తాడు. అప్పటిదాకా వేచి చూడాల్సిందే