Begin typing your search above and press return to search.
సీఎం.. సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు.. తారక్ ఏమన్నారంటే!
By: Tupaki Desk | 22 March 2021 4:30 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నటుడిగా తాతగారు.. నవరస నటసార్వభౌమ నందమూరి తారక రామారావు లెగసీని ముందుకు నడిపిస్తున్న ఏకైక మనవడిగా అతడిని తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆరాధిస్తారు.
తాతగారు ముందుకు నడిపించిన తెలుగు దేశం పార్టీ పగ్గాలు ఏ నాటికైనా జూ.ఎన్టీఆర్ చేపడతారనేది అభిమానుల భావన. అందుకే తారక్ ఎక్కడ కనిపించినా సీఎం సీఎం అనే నినాదాలు మిన్నంటుతాయి. తాజాగా ఎం.ఎం.కీరవాణి వారసుడు.. జక్కన్న కజిన్ శ్రీసింహా నటించిన తెల్లవారితే గురువారం (కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడు) ప్రీరిలీజ్ వేడుకలో తారక్ ప్రసంగిస్తుండగా.. అనూహ్యంగా అభిమానుల్లో సీఎం సీఎం అంటూ నినాదాలు మిన్నంటాయి. అభిమానుల వల్ల తారక్ స్పీచ్ కి ఇబ్బంది తలెత్తింది. దయచేసి ఆపండి బ్రదర్.. అంటూ తారక్ సముదాయించాల్సి వచ్చింది.
అయితే అభిమానుల పిలుపు మేరకు అతడు మునుముందు రాజకీయాల్లోకి వస్తారా? అంటే అందుకు అవకాశం కనిపించడం లేదు. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మీరు తిరిగి రాజకీయాల్లోకి వచ్చేదెపుడు? అన్న ప్రశ్నకు మీకు తెలుసు కదా బ్రదర్ అంటూ సమాధానం దాటవేశారు. తారక్ తెలుగు దేశం పార్టీకి సపోర్టర్ గా మాత్రమే ఉన్నారు. ఇంతకుముందు పార్టీకి ప్రచారం చేశారు. ప్రస్తుతానికి కేవలం సినిమాలపైనే తన దృష్టి అని ప్రాక్టికల్ గా అతడి నడవడిక ప్రూవ్ చేస్తోంది. యంగ్ టైగర్ రాజకీయాలపై అనాసక్తిగా ఉన్నారని అర్థమవుతూనే ఉంది. కానీ అభిమానులు మాత్రం ఎప్పటికైనా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తేదేపా పగ్గాలు చేపట్టి సీఎం అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. అది మరోసారి సినిమా ఈవెంట్ సాక్షిగా బయటపడడంతో దానిపై సర్వత్రా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు.