Begin typing your search above and press return to search.

Jr NTR ఫస్ట్ మూవీ.. ఈ లుక్ చూశారా!

By:  Tupaki Desk   |   22 Dec 2022 1:30 AM GMT
Jr NTR ఫస్ట్ మూవీ.. ఈ లుక్ చూశారా!
X
జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కూడా చక్రం తిప్పుతున్నాడు. అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ బాల నటుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తరువాత రెగ్యులర్ హీరోగా మరొక రేంజ్ కు ఎదుగుతూ వచ్చాడు. అతను కష్టపడిన విధానమే ఈరోజు ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకడిగా నిలబెట్టింది.

జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి కూడా నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ తన క్రేజ్ అయితే పెంచుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో అయితే వైరల్ గా మారింది. 2001లో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా సోలో హీరోగా నిన్ను చూడాలి అనే సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టాడు.

ఇక ఆ సినిమాలో ఎన్టీఆర్ నూనూగు మీసాలతో వచ్చి రాని గడ్డంతో చబ్బీ లుక్స్ తో కనిపించాడు. వి ఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ లో నిర్మించారు. ఈ సినిమాకు మొదట హైప్ బాగానే వచ్చినప్పటికీ ఎన్టీఆర్ కటౌట్ కు తగ్గట్టుగా లేకపోవడంతో అంతగా వర్కౌట్ కాలేదు. కానీ అందులో ఎన్టీఆర్ లుక్స్ నటన అలాగే SA రాజ్ కుమార్ అందించిన సంగీతం కూడా మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

2001 మే 25వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ వైరల్ గా మారింది. హీరోయిన్ రవీనా రాజ్ పుత్ తో ఎన్టీఆర్ క్లాస్ లుక్ అదిరింది అని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. దీన్ని చూస్తే ఒక సాంగ్ షూట్లో లోని స్టిల్ అని అర్ధమవుతోంది.

ఎన్టీఆర్ అప్పట్లో చాలా క్యూట్ లుక్స్ తో ఉన్నాడు అని మరికొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన స్టైల్ ను మార్చేసి స్టూడెంట్ నెంబర్ వన్, ఆది వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.