Begin typing your search above and press return to search.
మాయావి ముందు సైడ్ రోల్స్
By: Tupaki Desk | 15 Oct 2018 6:12 AM GMTదర్శకుడు గొప్పా? హీరో గొప్పా? ఈ ప్రశ్నకు టకీమని సమాధానం చెప్పేయగలరా? అంత సులువేం కాదు. కొన్ని సినిమాల్ని హీరోనే నెత్తిన వేసుకుని గెలిపించగలడు. కొన్నిటి విషయంలో దర్శకుడి హవానే కనిపిస్తుంది. ఇకపోతే టాలీవుడ్‌లో కొందరు దర్శకులు తమదైన మార్క్ చూపిస్తూ, హీరోలను మించి మేం అని నిరూపిస్తున్నారు. ఈ జాబితాలో తొలిగా వినిపించే పేరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ``త్రివిక్రమ్ మ్యాజిక్.. మాయావి పనితనం`` అంటూ జనం చర్చించుకునేంతగా ఆయన పాపులర్. పవన్ కల్యాణ్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్.. ఇలా ఎంత పెద్ద స్టార్లు ఉన్నా, వీళ్లతో పాటు త్రివిక్రమ్ పేరు గొప్పగా వినిపించింది అంటే అదీ అతడి ప్రభావం. స్టార్ ఇమేజ్ అనేది హీరోలకే కాదు.. దర్శకులకు కూడా ఉంటుంది అని నిరూపించిన మేధావి, బహుముఖ ప్రజ్ఞావంతుడు త్రివిక్రముడు.
అందుకే వేదికలను ఎక్కినప్పుడు పైకి కనిపించే ముఖం హీరోది అయినా వెనక అన్నీ నడిపించేది దర్శకుడేనని హీరోలు అంగీకరిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే అర్జునుడిని చుట్టూ ఉన్న పాత్రల్ని నడిపిస్తూ, భారతాన్ని నడిపించేది కృష్ణుడే అన్న చందంగా త్రివిక్రముడు సర్వాంతర్యామిగా సత్తా చాటుతున్నాడని చెప్పొచ్చు. అరవింద సమేత ఘనవిజయం నేపథ్యంలో మరోసారి త్రివిక్రమ్ పేరు ప్రముఖంగా చర్చల్లోకొస్తోంది. ఎన్టీఆర్ అంతటివాడు.. అసలు ఈ విజయానికి కారకుడు త్రివిక్రమ్ మాత్రమే. సామీ ఆ క్రెడిట్ మా ఖాతాలో వేయకు. అది మీకు చెందుతుంది.. అనేశాడంటే అర్థం చేసుకోవచ్చు.
అరవింద సక్సెస్ వేదిక పై ఎన్టీఆర్ మాట్లాడుతూ - నేను ఉండడం వల్లనే అరవింద సమేత హిట్ అయిందని త్రివిక్రమ్ అన్నారు. ఈ విజయం ఆయనది కాదని నా ఖాతాలో వేశారు. అది తప్పు. ఎందుకు తప్పని అంటున్నానంటే.. ప్రతి ఒక్కరికి త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుందంటే ఒక రకమైన ఆసక్తి. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు త్రివిక్రమ్. మిమ్మల్ని చూసి మేం బయలుదేరాం స్వామి. అరవింద విజయం మీ జర్నీలో భాగం. ఆ ప్రయాణంలో మేమంతా కలిశాం. ఇది ముమ్మాటికీ త్రివిక్రమ్ సినిమా. అతని విజయం.. అంటూ ఎమోషన్ అయ్యారు. చాలా చిత్రాల్లో ఎమోషనల్ గా నేను నటించాను. కానీ ప్రతి ఎమోషన్ ను డ్రైవ్ చేసేది దర్శకుడేనని త్రివిక్రమ్‌తో పాటు తన దర్శకులందరికీ తారక్ క్రెడిట్ ఇచ్చారు. త్రివిక్రమ్ దారి చూపిన దేవుడు అని కీర్తించేశాడు.