Begin typing your search above and press return to search.

తారక్ దర్శకుడు ఎవరో

By:  Tupaki Desk   |   7 March 2019 5:44 AM GMT
తారక్ దర్శకుడు ఎవరో
X
టెంపర్ సక్సెస్ తర్వాత కథలు దర్శకుల విషయంలో చాలా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి ఫెయిల్యూర్ లేకుండా ట్రాక్ రికార్డు మైంటైన్ చేయడం విశేషం. దాన్ని ఏ రకంగానూ రిస్క్ లో పెట్టడం ఇష్టం లేని తారక్ ఏడాదికి ఒక సినిమానే చేయగలుగుతున్నా దాని గురించి ఆలోచించడం లేదు. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఈ ఏడాది చివరి వరకు దానికే పూర్తి డేట్స్ కేటాయించాడు.

దీని తర్వాత ఏది ఉంటుందన్న అభిమానుల ప్రశ్నకు మాత్రం సమాధానం ప్రస్తుతానికి నో అనే. ఎందుకంటే నిజంగానే తారక్ ఎవరికి ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తానని మాటివ్వలేదు. ఒక్క డాక్టర్ కెఎల్ నారాయణకు మాత్రమే ఓ కమిట్మెంట్ బాకీ ఉన్నాడు. అది కూడా వచ్చే ఏడాది చేసేద్దామని మంచి కథ దర్శకుడు దొరికితే ఇప్పటి నుంచి స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడితే అప్పటికి రెడీగా ఉండొచ్చని ముందే చెప్పాడట కూడా. అయితే ఇప్పటికిప్పుడు స్టార్ డైరెక్టర్లు ఎవరూ ఖాళీగా లేరు.

కొరటాల శివ మొదలుకుని బోయపాటి శీను దాకా అందరూ బిజీగా ఉన్నారు. ఫామ్ లో లేని వివి వినాయక్ అదుర్స్ 2కి రెడీ అంటున్నాడు కానీ ఫ్యాన్స్ కి సుతరామూ ఇష్టం లేదు. వాళ్ళను కాదని జూనియర్ రిస్క్ చేయడమూ డౌటే. సో నిర్మాత నారాయణ ముందున్న తక్షణ కర్తవ్యం తారక్ కి కథ చెప్పి ఒప్పించి వచ్చే ఏడాది షూటింగ్ కి రెడీ గా ఉండే దర్శకుడిని వెతికి పట్టుకోవడం. ప్రస్తుతం ఆయన అదే పని మీద ఉన్నాడట. ఈ ఇద్దరి కాంబోలో గతంలో రాఖీ వచ్చింది