Begin typing your search above and press return to search.
బుల్లి ఎన్టీఆర్ స్కూల్ టైంకి మల్టీ స్టారర్
By: Tupaki Desk | 13 Oct 2018 9:21 AM GMTజూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ ఇచ్చిన సక్సెస్ కిక్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భారీ రికార్డులు నమోదు కావడం పట్ల అభిమానులతో పాటు తాను కూడా ఫుల్ ఖుషిగా ఉన్నాడు. దసరా విన్నర్ గా నిలవడం ఖాయం కావడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాకపోతే ఒకటికి ఐదు సార్లు దీన్ని చూసుకుని సంతృప్తి పడాల్సిందే. కారణం రాజమౌళి సినిమాలో జాయిన్ అయ్యాక తారక్ తొందరగా కనిపించడం అనుమానమే. ఇదే ప్రశ్న ప్రమోషన్ ఇంటర్వ్యూలలో అడిగినప్పుడు యంగ్ టైగర్ కు కూడా ఇదే సందేహం వచ్చింది. అందుకే వీలైనంత త్వరగా పూర్తి చేయమని రాజమౌళిని కోరతానని అన్నాడు. కాకపోతే అది పూర్తయ్యే లోపు తన చిన్న కొడుకు భార్గవ్ రామ్ స్కూల్ కు వెళ్లే వయసులో ఉంటాడేమోనని అనుమానం వ్యక్తం చేసాడు. ఇది సరదాగా అన్నా జక్కన్న అన్నంతపని చేసే టైపే. బాహబలి కోసం ఏకంగా ఐదేళ్లు ఖర్చు పెట్టుకున్నాడు.
ఇప్పుడు దాని బడ్జెట్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో మల్టీ స్టారర్ రూపొందనుంది. ఒక హీరోకే అంత టైం తీసుకునే రాజమౌళి ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ల తో సింపుల్ గా తీస్తాడంటే ఎవరూ నమ్మరు. అందుకే కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల గ్యాప్ వరకు తారక్ చరణ్ ల కొత్త సినిమా మరొకటి వస్తుందా అనే డౌట్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఇద్దరిలో ఎవరిని అడిగినా మేము చెప్పేది కాదు రాజమౌళినే అడగండి అంటున్నారు. పోనీ నేరుగా నిలదీద్దాం అంటే ఆయన దొరకడాయే. అందుకే వెయిట్ చేయడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ఇప్పటికే నగర శివారులో అల్యూమినియం ఫ్యాక్టరీని కథకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిలో టీమ్ బిజీగా ఉంది. డిసెంబర్ మొదటివారంలో ఇది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.