Begin typing your search above and press return to search.
మురుగదాస్ కథలో ఎన్టీఆర్?
By: Tupaki Desk | 10 Aug 2015 11:20 PM GMTపూరి తీసిన `టెంపర్`తో ఫామ్ లోకొచ్చాడు ఎన్టీఆర్. ఆయన కోసం బోలెడంత మంది దర్శకులు కథలు సిద్ధం చేసుకొన్నారు. అందులో స్టార్ దర్శకులు కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా మురుగదాస్ కథకి ఓకే చెప్పాడు. ఇటీవల కథానాయకులంతా తమిళంలోనూ మార్కెట్ ని విస్తరించాలని నిర్ణయించుకొన్నారు. రెండు భాషల్లో సినిమా సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ కూడా మురుగదాస్ కథకి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమాని మురుగ శిష్యుడైన గోపీచంద్ మలినేని తెరకెక్కించబోతున్నారు.
దిల్ రాజుతో పాటు మురుగదాస్ కూడా నిర్మాణంలో ఓ చేయి వేయబోతున్నట్టు తెలిసింది. ఇద్దరూ కలిసి తెలుగు, తమిళ భాషల్లో సినిమాని నిర్మించి మార్కెట్ చేసుకోవాలనుకొన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఆ సినిమా లండన్ లో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే చిత్రబృందం హైదరాబాద్ కి తిరిగొస్తుంది. ఆ సినిమా చివరి దశకు చేరుకోగానే మురుగదాస్ సినిమాకోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడని తెలిసింది.
మురుగదాస్ బలమైన కథల్ని రాస్తాడు. ఆయన తమిళంలో తీసిన `కత్తి`ని తెలుగులో ఎన్టీఆర్ తోనే తీస్తారని ప్రచారం సాగింది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లెమ్స్ క్రియేట్ అవ్వడంతో మురుగదాస్ ఎన్టీఆర్ కోసం కొత్తగా కథ రాశారట. ఓ సోషల్ ఎలిమెంట్ ఆధారంగా ఆ కథని సిద్ధం చేసినట్టు తెలిసింది.