Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ ఫస్ట్ అన్న డార్లింగ్
By: Tupaki Desk | 24 Dec 2018 6:00 AM GMTతన ఇంటర్వ్యూల టాక్ షో ద్వారా మసాలా ప్రశ్నలు అడిగి రేటింగ్స్ తెచ్చుకోవడంలో మంచి నేర్పరి అయిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ లేటెస్ట్ ఎపిసోడ్ బాహుబలి టీం పిల్లర్స్ రాజమౌళి-రానా-ప్రభాస్ లతో జరిగిన సంగతి తెలిసిందే. దాని తాలుకు ప్రోమోలు గత వారమే హల్చల్ చేశాయి. ఇప్పుడు దాని ఫుల్ వెర్షన్ వచ్చేసింది. అందులో కరణ్ అడిగిన కొన్నిప్రశ్నలు ఆసక్తికరంగా ఉండగా కొన్ని మాత్రం ఇరుకునపెట్టేలా ఉండటం గమనార్హం. అయితే ముగ్గురు దేనికీ తడబడకుండా తమదైన శైలిలో సమాధానాలు ఇవ్వడం విశేషం.
ఇందులో భాగంగా ప్రభాస్ ని టార్గెట్ చేసిన కరణ్ రామ్ చరణ్-బన్నీ-జూనియర్ ఎన్టీఆర్-మహేష్ లలో ర్యాంకింగ్ ప్రకారం ఎలా ఇస్తావని ప్రశ్న వేసాడు. నిజానికి ఇది కాస్త ఇబ్బందికరమైన ప్రశ్నే. నాకందరూ ఒకటే అని చెప్పి తప్పించుకోవచ్చు. అయితే ప్రభాస్ అలా కాకుండా స్ట్రెయిట్ గా తన మనసులో ఉన్నది చెప్పేసాడు. తనవరకు జూనియర్ ఎన్టీఆర్ కు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడట. ఆ తర్వాత సెకండ్ ర్యాంక్ మహేష్ బాబుకి మూడో ప్లేస్ అల్లు అర్జున్ కి ఆఖరి స్థానం రామ్ చరణ్ కు ఇస్తానని తేల్చేసాడు.
దీని మీద ఫ్యాన్స్ కు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనా ప్రభాస్ ఉద్దేశంలో వేరే అర్థాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే కరణ్ అడిగిన లిస్టు లో కెరీర్ లేట్ గా స్టార్ట్ అయ్యింది తక్కువ సినిమాలతో ఉన్నది రామ్ చరణే. జూనియర్ ఎన్టీఆర్ లు మహేష్ లు చెరో పాతిక సినిమాలు పూర్తి చేయగా బన్నీ 18 దాటేసి ఇరవైకి దగ్గరలో ఉన్నాడు. రామ్ చరణ్ వి అయ్యింది 11. సో సీనియారిటీ ప్రకారం చూసుకున్నా క్యాలిబర్ ప్రకారం చూసుకున్నా చరణ్ అందరి కంటే జూనియర్ అవుతాడు. ఆ కోణంలో కూడా ప్రభాస్ ఆలోచించి ఇలా చెప్పి ఉండవచ్చు. ఏదైతేనెం సదరు హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ మాటలతో అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్ల పర్వం మొదలుపెట్టేసారు.