Begin typing your search above and press return to search.
బాలయ్య ఎందుకిలా చేస్తున్నాడో..?
By: Tupaki Desk | 3 March 2016 5:30 AM GMT'నాన్నకు ప్రేమతో','డిక్టేటర్' చిత్రాలతో నందమూరి అభిమానుల మధ్య ఓ గీత ఏర్పడిందని చాలా స్పష్టంగా అర్ధమయింది. ఈ రెండు చిత్రాలకు అభిమానులు రెండు చీలిపోయి ఎవరి మూవీ ప్రమోషన్స్ వాళ్ళు చేసుకున్నారు. 'నాన్నకు ప్రేమతో' మూవీ ప్రమోషన్ కు బాలయ్య ఫ్యాన్స్ దూరంగా ఉంటే.. 'డిక్టేటర్' ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూరంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. నందమూరి బాలకృష్ణ నటించబోయే 100 సినిమాపై ఇప్పటినుండే హైప్ క్రియేట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ధీటుగా మరో నందమూరి హీరోను పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ 100వ సినిమాలో నారా రోహిత్ నటించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే కేవలం ఈ సినిమాలో నారా రోహిత్ మాత్రమే కాకుండా మొత్తం నందమూరి హీరోలందరూ కనిపించాలని ప్లాన్ చేస్తున్నారట. కళ్యాన్ రామ్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం. కాని ఎన్టీఆర్ కు మాత్రం బాలయ్య ఈ అవకాసం ఇవ్వలేనట్లు తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నారా రోహిత్ కు ఛాన్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ కు ఆ అవకాసం ఇవ్వకపోవడంతో ఫిలిం నగర్ ఇదొక హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య కావాలనే ఇదంతా చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.