Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ జయంతి.. జూనియర్ ఆవేదన..ఆగ్రహం
By: Tupaki Desk | 28 May 2019 4:56 AM GMTఎన్టీఆర్.. ఈ మూడు అక్షరాలు తెలుగునేలపై తెలియని వారుండరు.. తెలుగు వెండితెర ఇలవేల్పుగా.. అనంతరం రాజకీయ నేతగా చెరగని ముద్రవేసిన ఆయన 97వ జయంతి నేడు. మొన్నటి వరకు ఆయన జయంతి ఒక పండుగ.. మహానాడు పేరిట మూడు నాలుగు రోజులు చంద్రబాబు - టీడీపీ నేతలు పెద్ద పండుగలా నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. కానీ నేడు ఎన్టీఆర్ ఘాట్ కళతప్పింది. వెలవెల బోయింది. పూలు లేవు.. ఏర్పాట్లు లేవు.. అవే మొండి సమాధి గోడలు..ఘాట్ వద్ద కనీసం ఒక ఫ్లెక్సీ - ఒక్క పూవు కూడా లేని పరిస్థితి.. ఎందుకీ పరిస్థితి అంటే ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోవడమే..
టీడీపీ అధికారంలో ఉన్నన్నీనాళ్లు చంద్రబాబుకు ఎన్టీఆర్ దేవుడు. కానీ ఇప్పుడు ఏపీలో దారుణంగా ఓడిపోయిన వేళ మాత్రం ఎన్టీఆర్ .. చంద్రబాబుకు పట్టకుండా పోయాడు. ఓడినా.. గెలిచినా ఇంత ఎత్తుకు తీసుకెళ్లిన తెలుగుదేశం వ్యవస్థాపకుడిని ఆయన జయంతి నాడు స్మరించుకోవడం కనీస మర్యాద. కానీ ఓటమి భారంతో చంద్రబాబు.. అధికారం కోల్పోవడంతో టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ఎన్టీఆర్ జయంతిని గాలికి వదిలేశారు. ఎన్టీఆర్ ఘాట్ లో కనీసం నివాళులర్పించలేదు. చంద్రబాబు తీరుపై ఇప్పటికే అభిమానులు - ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గుర్రుగా ఉన్నారు.
టీడీపీని హైజాక్ చేసి ఇన్నాల్లు అధికారం అనుభవించిన చంద్రబాబు.. ఎన్టీఆర్ జయంతిని వదిలేసినా.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వదల్లేదు. ఈ ఉదయం 5.30గంటలకే అన్న కళ్యాణ్ రామ్ - కుటుంబ సభ్యులతో కలిసి తాత ఎన్టీఆర్ కు నివాళులర్పించడానికి ఘాట్ కు వచ్చాడు. పూలతో కళకళలాడాల్సిన సమాధి కళ తప్పడంతో జూనియర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ సీరియస్ అయ్యారు. అక్కడి జయంతి ఏర్పాట్లను అందరూ వదిలేయడంతో పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ఎవ్వరూ పట్టించుకోకున్నా ఇక నుంచి ఎన్టీఆర్ జయంతి - వర్ధంతిని తాను నిర్వహిస్తానని తెలిపారు.
వెంటనే అభిమానులను పంపించి భారీగా పుష్పాలను తెప్పించి ఎన్టీఆరే స్వయంగా తాత సమాధిని అలరించడం గమనార్హం. అక్కడే ఉన్న అభిమానులను కూడా సమాధిని మొత్తం పూలతో అలంకరింపచేశారు. అనంతరం కళకళలాడేలా చేశారు. తర్వాత పుష్పగుచ్చాలు వేసి ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ తాతకు నివాళులర్పించారు.
అనంతరం ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు కాసేపు మౌనంగా తాత సమాధి పక్కనే ఎన్టీఆర్ కూర్చున్నారు. ఇక నుంచి తాత జయంతి - వర్ధంతిని తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఎన్టీఆర్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా ఓటమితో చంద్రబాబు మహానాడును - ఎన్టీఆర్ జయంతిని ఏర్పాట్లను చూసుకోలేదు. ఎన్టీఆర్ వారసులు మాత్రం ఇక తామే ఏర్పాట్లను చూసుకుంటామని ప్రకటించడం ఎన్టీఆర్ జయంతి వేళ హాట్ టాపిక్ గా మారింది.