Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ కోసం క్యాలెండర్లు పంచుతాడుట
By: Tupaki Desk | 8 Dec 2015 4:56 AM GMTజూ.ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. ఈనెల 18 తర్వాత హైదరాబాద్ లో టీమ్ అడుగుపెడుతుంది. ఎట్టిపరిస్థితుల్లో జనవరి 8న ముందే ప్రకటించిన తేదీకే రిలీజ్ చేయాలన్నది ప్లాన్. డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్రిపరేషన్ లో ఉన్నాడు.
నాన్నకు ప్రేమతో ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే రిలీజ్ కావాలన్నది అభిమానుల ఆలోచన. అలాగే నిర్మాతలు - బయ్యర్లు - పంపిణీదారులు అందరి నుంచి టీమ్ పై తీవ్రంగా ప్రెజర్ పనిచేస్తోంది. డెడ్ లైన్ ని మీటవ్వాల్సిందేనని అంతా కోరుతున్నారు. అందుకే ఇప్పుడు యూనిట్ పై తీవ్ర ఒత్తిడి పనిచేస్తోందని చెబుతున్నారు. అయితే ఓ వైపు షూటింగు హడావుడిలో ఉన్న తారక్ మరోవైపు ఫ్యాన్స్ కోసం తాయిలం రెడీ చేస్తున్నాడు. జనవరి 1వ తేదీన అభిమానులకు పంచేందుకు క్యాలెండర్లు రెడీ చేస్తున్నాడు. ప్రతి యేటా ఇది చేస్తున్నదే అయినా ఈసారి చాలా ప్రత్యేకంగా ఉండాలని తారక్ భావిస్తున్నాడు. నాణ్యమైన క్యాలెండర్లను తయారు చేసి పంచాలని ప్లాన్ చేశాడుట. పైగా మునుపటి కంటే భారీ మొత్తంలో క్యాలెండర్లు పంచాలని ప్లాన్ చేశాడు.
ఎవరిరని మర్చిపోయినా అభిమానుల్ని మర్చిపోకూడదన్నది తారక్ ఆలోచన. ఫ్యాన్స్ లేకపోతే ఎవరూ ఉండరన్నది దీని సారాంశం. సేమ్ టైమ్ మూవీ రిలీజ్ కి వస్తోంది కాబట్టి ఫ్యాన్స్ నుంచి తనకి సపోర్ట్ అవసరం. అభిమానులతో అభిమానంగా ఎన్నో మంచి పనులు చేసే తారక్ ఈసారి మరింత సాన్నిహిత్యం పెంచుకునేందుకు ప్లాన్ చేశాడన్నమాట.