Begin typing your search above and press return to search.
శివకు మాటిచ్చిన యంగ్ టైగర్ ?
By: Tupaki Desk | 17 Jun 2019 4:44 AM GMTజనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. కాకపోతే ఇప్పటికిప్పుడు కాదు కానీ కనీసం వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలైతే ఉన్నాయట. ప్రస్తుతం జూనియర్ ఆర్ఆర్ఆర్ కోసం లాక్ అయిపోయాడు. రాజమౌళి తన ఇద్దరు హీరోలను డిసెంబర్ కంతా వదిలేస్తానని చెప్పాడు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ మాట మీద నిలవడం కష్టమే అనిపిస్తోంది.
ఊహించని విధంగా రెండు నెలల గ్యాప్ రావడం పెద్ద ప్రభావమే చూపించబోతోంది. సో 2020 జనవరి లేదా ఫిబ్రవరి దాకా తారక్ అందుబాటులోకి రావడం కష్టమే. అది కాగానే శివతో చేద్దామని ఓ కమిట్ మెంట్ ఇచ్చాడని టాక్ . మరోవైపు కొరటాల శివ సైరా షూటింగ్ ఎప్పుడు అయిపోయి సురేందర్ రెడ్డి చిరుని తనకు వదులుతాడా అని ఏడెనిమిది నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడది ఫైనల్ స్టేజికి వచ్చేసింది. తమ బ్యానర్లో కొరటాల శివ చిరు 152 చేయబోతున్న విషయాన్ని కొణిదెల సంస్థ మొన్న అతని బర్త్ డే సందర్భంగా అధికారికంగా చెప్పేసింది కాబట్టి ఇక నో డౌట్స్.
ఇంకో రెండు నెలల్లో స్టార్ట్ అయినా అది పూర్తి చేసేందుకు ఎంత లేదన్నా ఆరు నెలలకు పైగా టైం కావాలి. ఎలాగూ రెడీగా ఉన్న స్క్రిప్ట్ కాబట్టి మరీ ఎక్కువ ఆలస్యం జరగకపోవచ్చు. ఈ లెక్కన జూనియర్ ప్లస్ కొరటాల శివ ఓ కొన్ని నెలల గ్యాప్ లో అటు ఇటు ఒకేసారి ఫ్రీ అయ్యేలా ఉన్నారు. ఇప్పుడీ వార్త నిజమే అయితే జనతా గ్యారేజ్ ని మించిన మాస్ ఎంటర్ టైనర్ ని ఆశించవచ్చు