Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. సుక్కూ.. పల్నాడు ఫ్యాక్షన్
By: Tupaki Desk | 5 Nov 2015 5:03 AM GMTసెన్సిటివ్ అంశాలతో కూడా సొగసరి కమర్షియల్ సినిమాలను తీయడంలో సుకుమార్ దిట్ట. ఒక్క ఆర్య 2 విషయంలో మాత్రం ఫ్యాక్షన్ వంటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లను తీసుకోగా.. ఆ తరువాత 1 నేనొక్కడినే కోసం అలాంటి యాక్షన్ అంశాలను జోడించాడు కాని.. మాస్ లుక్ తో ఏమీ ప్రయత్నించాలేదు. కాని యంగ్ టైగర్ వరకు వచ్చేసరికి మరోసారి మ..మ..మ్మాస్ అంటున్నాడా ఈ దర్శకుడు? అవుననే అంటున్నాడు టాలీవుడ్ జనాలు.
అసలు 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఇప్పటివరకు కేవలం స్టయిలిష్ లుక్ తో పిచ్చెత్తిస్తున్న ఎన్టీఆర్ ను మాత్రమే చూశాం. కాని నేషనల్ మీడియా సైతం ఇప్పుడు ఈ సినిమా కథ గురించి డిస్కస్ చేస్తోంది. ఇప్పటికే రెండు నెలల పాటు లండన్ లో చిత్రీకరించబడిని ఈ సినిమాను.. తదుపరి స్పెయిన్ లో షూట్ చేయనున్నారు. అయితే 14న స్పెయిన్ ఫ్లయిట్ ఎక్కేలోపు హైదరాబాద్ లోనే చాలా షూట్ కానిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని.. ఒకటి స్టయిలిష్ రోల్ అయితే మరొకటి సైకో మాదిరి ప్రవర్తించే రోల్ అని ఒక రూమర్ ఉంది. అంతే కాదట.. ఈ సినిమా ప్రస్తుత స్టోరీ లండన్ లో జరిగితే.. ఫ్లాష్ బ్యాక్ మాత్రం పల్నాడు బ్యాక్ డ్రాప్ లో ఇండియాలో ఉంటుందట. అంటే మరోసారి ఫ్యాక్షన్ రణరంగం అనమాట. ఎన్టీఆర్ కు అది రెగ్యులర్ ఎలిమెంటే అయినా.. ఇలాంటి స్టయిలిష్ ఫిలింలో ఫ్యాక్షన్ అంటే మాత్రం ఏదో కొత్తగానే ఉంది.
కాని ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఇండియా షెడ్యూల్ అనేది ఏదీ ప్లాన్ చేసినట్లే లేదు. సినిమా అంతా లండన్ - స్పెయిన్ - బల్గేరియాలో తీసేసి.. ఏదో ఒకటి రెండు రోజులు ఇండియాలో తీస్తారని చెప్పారు. అలాంటప్పుడు పల్నాడు సీన్లు ఎక్కడ తీస్తున్నట్లు? స్పెయిన్ లో రాకీ టెరైన్ లో తీస్తున్నారా ఏంటి?