Begin typing your search above and press return to search.

జనతా హీరో రెండో అవతార్ చూపిస్తాడట

By:  Tupaki Desk   |   12 Jun 2016 7:25 AM GMT
జనతా హీరో రెండో అవతార్ చూపిస్తాడట
X
మాస్ హీరో అన్న పదానికి సరైన రూపంలా ఉంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మాస్ సినిమాకి క్లాస్ ఎలిమెంట్స్ ని స్టైలిష్ మిక్స్ చేయడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. ఈ దర్శకుడు తీసిన రెండు సినిమాల్లోనూ రన్నింగ్ స్టోరీతో పాటు సమానంగా ఫ్లాష్ బ్యాక్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో రానున్న సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ కథ గట్టిగానే ఉంటుందట.

ఇప్పటివరకూ జనతా గ్యారేజ్ స్టోరీ అయితే లీక్ అవ్వలేదు కానీ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తాడట. జూనియర్ కి స్టైలిస్ట్ గా పని చేస్తున్న అశ్విన్ ఈ విషయాన్ని చెప్పేశాడు. 'ఇది సిటీ కేరక్టర్ కావడంతో ఎక్కువ స్టైలింగ్ అవసరం లేదు. కానీ తన కేరక్టర్ ని కాస్ట్యూమ్స్ లోనే చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో స్టైలిష్ గా ఉండాలి. గత సినిమాలను బేస్ చేసుకుని.. విభిన్నంగా ఉండేలా కాస్ట్యూమ్స్ సిద్ధం చేశా' అన్న స్టైలిస్ట్.. మాటల మధ్యల మరో ఇంట్రెస్టింగ్ డీటైల్ కూడా చెప్పేశాడు.

అన్ని పారామీటర్స్ చూసుకుని అర డజన్ గెటప్ లను సిద్ధం చేస్తే.. స్టోరీ ప్రకారం ఇందులో రెండింటిని సెలక్ట్ చేసుకున్నాడట జూనియర్. ఫ్లాష్ బ్యాక్ లో ఒక గెటప్ లోను, రన్నింగ్ స్టోరీలో ఒక గెటప్ లోను ఎన్టీఆర్ కనిపించనున్నాడని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో చిత్రం తర్వాత ఎన్టీఆర్ మేకోవర్ లపై జనాల్లో కూడా బాగా ఆసక్తి పెరిగింది. అయితే.. పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాకి కి తోడు.. అదిరిపోయే కథనంతో జనతా గ్యారేజ్ ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది.