Begin typing your search above and press return to search.
మహేషన్నను వదిలేయండి - తారక్
By: Tupaki Desk | 7 April 2018 5:42 PM GMTఇవాళ జరిగిన భరత్ అనే నేను వేడుకలో అందరి కళ్ళు మహేష్ బాబు మీద ఉండటం కామనే కాని ప్రిన్స్ తో పాటు సమానమైన అటెన్షన్ తీసుకున్న చీఫ్ గెస్ట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన మాటలతో హోల్ సేల్ గా మహేష్ ఫాన్స్ మనసులు గెలిచేసుకున్నాడు. నందమూరి తారకరామారావు మనవడినైన నేను అంటూ స్పీచ్ మొదలుపెట్టిన తారక్ మహేష్ ను మీరంతా సూపర్ స్టార్-ప్రిన్స్ అని ఎలా పిల్చుకున్నా నేను మాత్రం మహేష్ అన్నా అంటూ పిలుస్తాను అని చెప్పగానే స్టేడియం విజిల్స్ తో మారుమ్రోగిపోయింది. తామిద్దరం ఇలా కలుసుకోవడం మీకు కొత్తగా ఉండొచ్చు కాని తనకు మహేష్ అన్నకు కాదని చెప్పిన తారక్ తను ముఖ్య అతిధిని కానని ఈ కుటుంబంలో ఒక సభ్యుడిగా వచ్చానని చెప్పి మరోసారి చప్పట్లతో హోరెత్తించేసాడు.
తనకు ఇలాంటి వేదికలపై ఏం మాట్లాడాలో తెలియదన్న తారక్ లేదు లేదు అంటూనే అన్ని మాట్లాడేసాడు. తనకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో మహేష్ అన్న చేసినన్ని ప్రయోగాలు ఇంతవరకు ఎవరు చేయలేదని తనతో సహా మిగిలిన వారంతా ఇప్పుడిప్పుడే మొదలు పెట్టమని చెబుతున్నప్పుడు వచ్చిన స్పందన మామూలుగా లేదు. దర్శకుడు కొరటాల శివ తనతో తీసిన జనతా గ్యారేజ్ లో ఒక డైలాగ్ ని ఉదాహరించిన జూనియర్ ఎన్టీఆర్ మహేష్ ని చాలా అరుదైన రకంగా వర్ణిస్తూ అతన్ని అలాగే ఉండనిద్దాం అన్నప్పుడు మహేష్ ముసిముసి నవ్వుల వెనుక ఆనందాన్ని చూసేందుకు అభిమానులకు రెండు కళ్ళు చాలలేదేమో.
మొత్తానికి పొదుపుగా కొంచెం సేపే మాట్లాడిన యంగ్ టైగర్ ఆ కాసిన్ని మాటలతోనే ప్రిన్స్ ఫాన్స్ హృదయాలను గెలిచేసుకున్నాడు. ఏం మాట్లాడతాడు అనే అంచనాలు పూర్తిగా నిలబెట్టుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన తీరు చూస్తే మహేష్ అన్నట్టు ఇకపై ఇలాంటి వేడుకలకు వేరే హీరోలు కూడా వస్తారు కొత్త ట్రెండ్ మొదలైపోయింది అని చెప్పిన మాట అక్షరాల నిజం అనిపిస్తుంది. గుడ్ గోయింగ్ తారక్-వీ లవ్ యు. ఇదండీ ఫంక్షన్ చివర్లో తారక్ స్పీచ్ గురించి మహేష్ ఫాన్స్ అన్న మాట.