Begin typing your search above and press return to search.

నాకు దేవుడిచ్చిన కుటుంబం జ‌క్క‌న్న‌- కీర‌వాణి!-తార‌క్

By:  Tupaki Desk   |   22 March 2021 3:30 AM GMT
నాకు దేవుడిచ్చిన కుటుంబం జ‌క్క‌న్న‌- కీర‌వాణి!-తార‌క్
X
``నాకు 20 ఏళ్ల నుంచి దేవుడు ఇచ్చిన శక్తి అభిమానులైతే.. నాకు దేవుడిచ్చిన కుటుంబం జ‌క్క‌న్న‌- కీరవాణి కుటుంబం. నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ప్ర‌త్య‌క్షంగానో ప‌రోక్షంగానో వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ అతిథిని కాను. నేను వారి కుటుంబ స‌భ్యుడిగానే భావిస్తాను`` అని అన్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. కీర‌వాణి వార‌సులు శ్రీ‌సింహా హీరోగా న‌టించిన `తెల్ల‌వారితే గురువారం` ప్రీరిలీజ్ వేడుక‌లో తార‌క్ పైవిధంగా ఎమోష‌న‌ల్ అయ్యారు. హీరో శ్రీ‌సింహా.. సంగీత ద‌ర్శ‌కుడు కాల భైర‌వ త‌న‌కు సొంత సోద‌రులు అని తార‌క్ అన్నారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ``జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను. అభిమానుల‌తోనే ఎన‌ర్జీ.. నా వార‌సులు అభయ్- భార్గవ్ ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి చెప్పాలంటే మాట్లాడలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో.. నా తమ్ముళ్లు సింహా- భైరవ విజ‌యాలు సాధిస్తున్నారు. వారి గురించి మాటలు సరిపోవడం లేదు. రేపొద్దున భార్గవ్- అభయ్ ను చూసీ ఇలానే సంబరపడతానేమో`` అని అన్నారు.

సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది. నాన్న గారికి స‌న్నిహితుడు. సినిమా సక్సెస్ అవ్వాలి.. భైరవ- సింహ మ‌రో మెట్టు ఎక్కాలి. దర్శకుడు మ‌ణికాంత్ కి సక్సెస్ రావాలి`` అన్నారు.