Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ వైఖరిలో ఎందుకింత మార్పు?
By: Tupaki Desk | 5 Jan 2016 5:17 AM GMTటాలీవుడ్ లో ట్యాలెంటెడ్ స్టార్ ఎన్టీఆర్. మాస్ లో బాస్ అతడు. బాక్సాఫీస్ ని గడగడలాడించే సత్తా ఉన్న హీరో. అందుకే పాతిక సినిమాల కెరీర్ ని తిరుగు లేకుండా నడిపించాడు. అయితే ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. తన స్టామినాకి తగ్గ విజయం వెంటరాలేదు. అందుకేనేమో కాస్తంత నిరాశగానే కనిపిస్తున్నాడు. ఇప్పుడు నాన్నకు ప్రేమతో చిత్రంతో ఆ అసంతృప్తిని అధిగమించాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇది కెరీర్ 25వ సినిమా. అందుకే నిన్న ప్రత్యేకించి వ్యక్తిగతంగా మీడియాని కలిసి గ్రీట్ చేశాడు. హైదరాబాద్ దసపల్లా హోటల్ లో మీడియా మిత్రుల్ని కలిసి మనసు విప్పి మాట్లాడాడు తారక్.
ఇటీవలి కాలంలో నా బిడ్డ పుట్టాక కాస్త బిజీ అయిపోయా. మరోవైపు సినిమాలతోనూ బిజీ. అందువల్లనే సరిగా కలవలేకపోయాను. తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్. నేనెప్పుడూ మీవాడినే. ఎప్పటికీ ఇలానే ఉంటాను. మీ మనిషిగానే ఉంటాను. ఎప్పటికప్పుడు మనం కలుసుకుంటూనే ఉంటాం... అని తన మనసులో మాట చెప్పాడు. అయితే దశాబ్ధం పైగా సాగించిన ఈ కెరీర్ లో ఎన్టీఆర్ ఏనాడూ ఇలా వ్యక్తిగతంగా వచ్చి కలిసిందే లేదు. ఇన్నాళ్టికి ఇలా వచ్చి కలవడం వెనక అసలు రీజన్ ఏంటి? అని అనుకున్నారంతా. అయితే అతడు వచ్చిన ఉద్ధేశం చాలా మంచిది. అందరితో కలిసుండాలి. అలా ఉన్నప్పుడు వచ్చే కిక్కే వేరు. విజయం వచ్చినా నాతో ఎవరూ లేరే.. అన్న భావన రాకుండా ఉంటుంది. అందుకే గత రాత్రి పార్టీ హోస్ట్ చేశాడట.