Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మరోసారి అప్సెట్ చేశాడు

By:  Tupaki Desk   |   22 July 2022 11:30 AM GMT
ఎన్టీఆర్ మరోసారి అప్సెట్ చేశాడు
X
జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా విడుదల అవుతుంది అంటే ప్రమోషన్స్ చేసే క్రమంలో చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉంటాడు. ఎలాంటి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా చాలా ఓపికతో అన్ని తరహా ప్రశ్నలకు సమాధానం చెబుతూ అలాగే అభిమానుల గురించి కూడా ఎంతో గొప్పగా చెబుతూ ఉంటాడు. అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా ప్రైవసీని కోరుకుంటాడు అని అర్థమవుతుంది.

ఇక ఇటీవల మరోసారి ఎన్టీఆర్ ఒక విషయంలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిశీనట్లుగా తెలుస్తోంది. సాధారణంగా నందమూరి అభిమానుల్లో కేవలం హీరోలను మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఎంతగానో అభిమానం చూపిస్తూ ఉంటారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ కు సంబంధించిన కుమారుల పేర్లు అలాగే వారి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందించేది చాలా తక్కువ. ఇక వారి కుటుంబంలో ఏదైనా వేడుకలు జరిగితే మాత్రం సోషల్ మీడియాలో ఏమాత్రం అవ్వరు ఇక ఇటీవల మరోసారి ఆయన పెద్ద కుమారుడు అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఫోటో కూడా పోస్ట్ చేయలేకపోయారు.

గతంలో కూడా ఎన్టీఆర్ ఎలాంటి ఫోటో కూడా షేర్ చేసింది లేదు. ఇక ఈసారి కూడా ఎన్టీఆర్ మళ్లీ అదే తరహాలో ఎలాంటి ఫోటో కూడా షేర్ చేయలేదు.

దీంతో ఓ వర్గం అభిమానులు తీవ్రంగా అప్సెట్ అయ్యారు అనే చెప్పాలి. కనీసం ఒక ఫోటో షేర్ చేసుకున్నా కూడా ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అని చెబుతున్నారు.

అయితే ఎన్టీఆర్ మాత్రం ఫ్యామిలీ విషయంలో మాత్రం వీలైనంత ఎక్కువగా ప్రైవైసినీ కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే ముందు ప్రత్యేకంగా ఫ్యామిలీతో కలిసి విదేశాలలో కూడా వెళ్లడం జరిగింది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.