Begin typing your search above and press return to search.

తెల్ల‌వారుజాముకే ఎన్టీఆర్ అక్క‌డికొచ్చేశారు

By:  Tupaki Desk   |   28 May 2017 9:26 AM GMT
తెల్ల‌వారుజాముకే ఎన్టీఆర్ అక్క‌డికొచ్చేశారు
X
తెలుగోడి ఆత్మ‌గౌర‌వాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ఎన్టీవోడి జ‌యంతి నేడు. ఆయ‌న జ‌యంతి.. వ‌ర్థంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు ఆయ‌న స‌మాధి వ‌ద్ద‌కు క్యూ క‌ట్ట‌టం తెలిసిందే. ఈ రోజు ఎన్టీవోడి జ‌యంతి సంద‌ర్భంగా తెల్ల‌తెల్ల‌వారుజామున ఐదున్న‌ర గంట‌ల‌కే ఎన్టీఆర్ ఘాట్‌కు వ‌చ్చేశారు. నేరుగా తాత స‌మాధి వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. స‌మాధిపైన ప‌రిచిన పువ్వుల్ని స్పృశించిన ఆయ‌న‌.. తాత‌కు నివాళులు అర్పించారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ తో పాటు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌దిత‌రులున్నారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్ప‌టికీ ఉంటాయ‌న్న ఆయ‌న‌.. ఆయ‌న స్థానం మ‌రెవ్వ‌రికీ ద‌క్క‌ద‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని చెప్పిన తార‌క్‌.. మీడియాతో చాలా త‌క్కువ‌గా మాట్లాడారు.

సూటిగా.. స్ప‌ష్టంగా మూడు ముక్క‌ల్లో తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పేసిన ఆయ‌న‌.. నివాళులు అర్పించిన వెంట‌నే వెళ్లిపోయారు. ఇక‌.. ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు హ‌రికృష్ణ‌.. రామ‌కృష్ణ‌తో స‌హా ప‌లువురు ఎన్టీఆర్ ఘాట్‌ కు వెళ్లి ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. మ‌రోవైపు.. పార్టీ అధినేత చంద్ర‌బాబు.. ఆయ‌న కుమారుడు లోకేశ్ విశాఖ‌లో ఉండిపోయారు. మ‌హానాడు నేప‌థ్యంలో వారు అక్క‌డే ఉండాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా.. మ‌ధ్యాహ్నం ప‌న్నెండు గంట‌ల‌కు కాస్త ముందుగా ఎన్టీఆర్ కుమార్తె.. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి.. ఎన్టీఆర్ మ‌న‌మ‌రాలు బ్రాహ్మ‌ణి.. ఇత‌ర ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్ ఘాట్‌కు వ‌చ్చి నివాళులు అర్పించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/