Begin typing your search above and press return to search.

చరణ్‌ కొడితే ఎన్టీఆర్ ఇస్తాడా??

By:  Tupaki Desk   |   9 Dec 2016 5:54 AM GMT
చరణ్‌ కొడితే ఎన్టీఆర్ ఇస్తాడా??
X
ఇవాళ రిలీజ్ అయిన రామ్ చరణ్ మూవీ ధృవ రిజల్ట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. మెగా మూవీ కోసం నందమూరి హీరో టెన్షన్ పడ్డం అంటే కొంచెం అతిశయోక్తిగానే ఉండొచ్చుకానీ.. యంగ్ టైగర్ సన్నిహితులు ఇది నిజమే అని చెబుతున్నారు. ఇందుకు కారణం.. దర్శకుడు సురేందర్ రెడ్డి.

జనతా గ్యారేజ్ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి మూడు నెలలు గడిచినా.. ఎన్టీఆర్ ఇప్పటివరకూ కొత్త సినిమా ప్రారంభించకపోవడానికి కారణం.. దర్శకుడి విషయంలో తుది నిర్ణయానికి రాకపోవడమే. ప్రస్తుతం బాబీతో ఓ మూవీ యాక్సెప్ట్ చేసిన దాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. కానీ ఈ సమయంలోనే ఎన్టీఆర్ కి బాగా క్లోజ్ అయిన వక్కంతం వంశీ.. దర్శకుడు సురేందర్ రెడ్డి ద్వారా ఓ స్టోరీలైన్ చెప్పించాడట. ఇప్పటికే సూరితో ఊసరవెల్లి.. అశోక్ చిత్రాలను చేసిన ఎన్టీఆర్ కి.. కొత్త లైన్ కూడా బాగా నచ్చడంతో మరోసారి ఆలోచనలో పడిపోయాడట. కానీ రీసెంట్ కా కిక్2 తో పెద్ద ఫ్లాప్ కొట్టిన వక్కంతం-సురేందర్ రెడ్డిల కాంబినేషన్ ఎన్టీఆర్ అంత నమ్మకంగా లేడని అంటున్నారు.

కానీ రామ్ చరణ్ ధృవ సక్సెస్ అయితే మాత్రం.. ఎన్టీఆర్ కి సురేందర్ సామర్ధ్యంపై మరోసారి నమ్మకం పెరుగుతుంది. ఒక వేళ చెర్రీకి సక్సెస్ ఇవ్వడంలో సూరి ఫెయిల్ అయితే మాత్రం.. తన దగ్గరున్న ఆప్షన్ బాబీతో అడ్వాన్స్ అయిపోవచ్చని అనుకుంటున్నాడట యంగ్ టైగర్. అప్పుడు లక్కీ ఛాన్స్ బాబీ వంతు అవుతుందన్న మాట అంటున్నారు సన్నిహితులు. అలా.. ధృవ రిజల్ట్ కోసం రామ్ చరణ్.. సురేందర్ రెడ్డిలతో పాటు.. ఎన్టీఆర్-బాబీలు కూడా వెయిటింగ్ చేయాల్సి వచ్చింది.