Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ వైఫ్‌ ప్రెగ్నెంటే.. ఇదిగో ప్రూఫ్‌

By:  Tupaki Desk   |   2 March 2018 8:13 AM GMT
ఎన్టీఆర్ వైఫ్‌ ప్రెగ్నెంటే.. ఇదిగో ప్రూఫ్‌
X
వరుస హిట్లతో ఎన్టీఆర్ కెరీర్ పరంగా చాలా ఆనందంగా ఉన్నాడు. కానీ ప్రైవేట్ లైఫ్ లో మరింత ఆనందంగా ఉన్నాడు. 2011 లో లక్ష్మీ ప్రణతి ని పెళ్లాడిన తారక్ కు ఒక బాబు కూడా ఉన్నాడు. అభయ్ రామ్ పుట్టాక తన జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది అంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో సారి తండ్రి కాబోతున్నాడు అని వార్తలు మనం వింటూనే ఉన్నాం. అది నిజమేనా?

లక్ష్మీ ప్రణతి రెండోసారి గర్భవతి అయ్యింది అన్న విషయం ఇండస్ట్రీ లొనే ఒక హాట్ టాపిక్ గా మారింది. మరొక బుల్లి ఎన్టీఆర్ నందమూరి కుటుంబంలోకి అడుగుపెట్టబోతున్నాడు అని ఫాన్స్ అంతా పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ దీనిపై ఆఫీషియల్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ రాకపోయేసరికి ఫాన్స్ కొంత డీలా పడ్డారని చెప్పచ్చు. ఎన్టీఆర్ కానీ నందమూరి కుటుంబ సభ్యులు లని స్వయంగా చెప్పకపోయినా ఎన్టీఆర్, ప్రణతి రెండవ సంతానాన్ని త్వరలో ఆహ్వానించబోతున్నారు అనటానికి గల కొన్ని ప్రూఫ్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

ఒక ఫామిలీ ఫంక్షన్ కి వెళ్లిన ప్రణతి బేబీ బంప్ తో కనపడేసరికి ఫాన్స్ లో మళ్ళీ ఆనందోత్సాహం ఉప్పొంగింది. మొత్తానికి ఎవరు అనౌన్స్ చేయాపోయినా ప్రణతిని చూసి అందరూ కుడుటపడ్డారు. మేలో డ్యూ డేట్ ఇచ్చారని తెలియగా ఫ్యాన్సే కాకుండా నందమూరి ఫ్యామిలీ కూడా అభయ్ రామ్ కు తమ్ముడు పుడతాడా, చెల్లెలు పుడుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.