Begin typing your search above and press return to search.

రేర్ ఫోటో: భార్యామణితో తార‌క రామ‌

By:  Tupaki Desk   |   28 March 2020 5:30 AM GMT
రేర్ ఫోటో: భార్యామణితో తార‌క రామ‌
X
నైట్ పార్టీలో ఏదో ఏకాంత స‌మ‌యాన్ని భంగప‌రిచి మ‌రీ ఈ స్నాప్ లాగిన‌ట్టే ఉంది! లేదంటే మరీ అంత రొమాంటిక్ లుక్ పైగా నేచుర‌ల్ రొమాన్స్ సాధ్య‌మేనా? తార‌క్ అభిమానుల్లో వైర‌ల్ అవుతున్న ఈ స్పెష‌ల్ ఫోటో ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఆ ఫోటో ఎక్క‌డిది? ఎప్ప‌టిది? అంటే మాత్రం అందుకు క్లూ దొరికింది.

అప్ప‌ట్లో యంగ్ య‌మ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజ‌న్ 2 హోస్ట్ గా కొన‌సాగిన‌ప్ప‌టి త్రోబ్యాక్ ఫోటో ఇది. అప్ప‌ట్లోనే బ‌హుశా ఆన్ లొకేష‌న్ ఇలా త‌న భార్యామ‌ణి ప్ర‌ణ‌తితో క‌లిసి ఫోటో దిగాడు. తార‌క్ న‌వ్వితే చంద‌మామ న‌వ్విన‌ట్టే. అంత‌గా వెన్నెల కురుస్తోంది అక్క‌డ‌. ఇక ప్ర‌ణ‌తి అంతే జోష్ తో హ‌బ్బీని వెన‌క వైపుగా హ‌గ్ చేసుకుని ఫోజిచ్చేయ‌డంతో రొమాన్స్ రంజుగానే కుదిరింది. బిగ్ బాస్ అఫీషియ‌ల్ టీమ్ ఈ అరుదైన ఫోటోని షేర్ చేసింది.

ఇక ప్ర‌స్తుత ఎమ‌ర్జెన్సీ స‌న్నివేశంలో కరోనా వైర‌స్ విష‌య‌మై ప్ర‌జ‌ల్ని అభిమానుల్ని అప్ర‌మ‌త్త చేసిన తార‌క్ ప్ర‌స్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్నారు. ఇంట్లోనే భార్యామ‌ణి వార‌సుల‌తో పాటుగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్ర‌స్తుత లాక్ డౌన్ స‌మ‌యం ఇంటికే కేటాయించే అవ‌కాశం అదృష్టం ద‌క్కింది. అయితే ఆర్.ఆర్.ఆర్ కొత్త షెడ్యూల్ ఎప్ప‌టికి ప్రారంభ‌మ‌వుతుంది? అన్న‌ది మాత్రం ఇప్ప‌ట్లో సందేహంగా మారింది. అప్ప‌టి వ‌ర‌కూ మ‌రి టైమ్ ని ఇలానే స్పెండ్ చేయాలా? ఇప్ప‌టి వ‌ర‌కూ షూటింగుల‌కు ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం ఏప్రిల్ 15 వ‌ర‌కూ ప్ర‌జంలంద‌రినీ ఇండ్ల‌లోనే ఉండ‌మ‌ని లాక్ డౌన్ ప్ర‌క‌టించేసింది. మ‌రి షూటింగుల బంద్.. ఇత‌ర‌త్రా బంద్ లు ఎప్ప‌టివ‌ర‌కూ కొన‌సాగుతాయ‌న్న‌ది చూడాలి.