Begin typing your search above and press return to search.

బాహుబ‌లి ఏనుగులా RRR పులి ప‌క్కా ట్రైన్డ్

By:  Tupaki Desk   |   18 Sep 2019 6:12 AM GMT
బాహుబ‌లి ఏనుగులా RRR పులి ప‌క్కా ట్రైన్డ్
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే తార‌క్ పాల్గొన‌గా బ‌ల్గేరియాలో కీల‌క షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో సినిమాకే హైలైట్ గా నిలిచే అత్యంత కీల‌క‌మైన వైల్డ్ యాక్ష‌న్ ఎపిసోడ్ ని తెర‌కెక్కించారు. అది కూడా కొమ‌రం భీమ్ పాత్ర‌ధారి అయిన తార‌క్ ఓ భీక‌ర‌మైన అడ‌విలో పెద్ద పులితో పోరాడే స‌న్నివేశం తెర‌కెక్కించారు.

పెద్ద పులి అంటే సీజీ పులి క‌దా? అని అనుకోవ‌చ్చు. అయితే అది పూర్తిగా సీజీలో మాత్ర‌మే డిజైన్ చేయాల్సిన పులి మాత్ర‌మే కాదు. ఒక రియ‌ల్ పులితో కొన్ని పోరాటానికి సంబంధించిన లాంగ్ షాట్స్ తీస్తారు. క్లోజ‌ప్ లో గ్రీన్ మ్యాట్ - బ్లూమ్యాట్ ఫార్మాట్ లో మిక్స్ చేసుకోగ‌లిగేలా కొన్ని షాట్ల‌ను చిత్రీక‌రించాల్సి ఉంటుంది. ఆ త‌ర‌హాలో అవ‌స‌రం అయిన షాట్స్ ని చిత్రీక‌రించార‌ట‌. అయితే తార‌క్ అభిమానుల్లో ఇప్ప‌టికీ ఓ సందేహం ఉంది. నిజంగానే ఎన్టీఆర్ రియ‌ల్ పులితోనే ఫైట్ చేశారా? అదెలా సాధ్యం అంటూ ముచ్చ‌టించుకున్నారు. అందుకే ఈ క్లారిటీ.

ఇంత‌కీ ఆ పులిని ఎక్క‌డి నుంచి తెచ్చారు? అంటే.. బ‌ల్గేరియాలో రియ‌ల్ గానే ట్రైనింగ్ తీసుకున్న పులి ఒక‌టి ఉంద‌ట‌. ఇది మ‌నుషుల‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తుంది. దానిని మ‌చ్చిక చేసుకుని ఇలా షూటింగుల‌కు వాడుతున్నార‌ని తెలిసింది. ఇంత‌కుముందు బాహుబ‌లి సినిమా కోసం కేర‌ళ‌కు చెందిన‌ గ‌జ‌రాజు కాళీ (చిర‌క్క‌ల్ కాళిదాస‌న్ పూర్తి పేరు)ను ఇలానే జ‌క్క‌న్న టీమ్ మ‌చ్చిక చేసుకుని సినిమా కి ఉప‌యోగించారు. ఆ ఏనుగు అంత‌కుముందు ప‌లు హాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టించింది. ఆంగ్ లీ న‌టించిన‌ ఆంగ్ బ్యాక్ 3 చిత్రంలోనూ ఆ భారీ ఏనుగు క‌నిపించింది.

అన్న‌ట్టు పెద్ద పులితో పోరాడేది ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ ఇద్ద‌రూ అంటూ ప్ర‌చార‌మైంది. అయితే అది పుకార్ మాత్ర‌మే. అల్లూరి సీతారామ‌రాజు (చ‌ర‌ణ్) పాత్ర పులితో పోరాడ‌దు. ఓన్లీ కొమ‌రం భీమ్ (తార‌క్) మాత్ర‌మే పులితో పోరాడ‌తాడు. దీనికి సీజీ వ‌ర్క్ అవ‌స‌రం ఉంటుంది. ఇటీవ‌లే బ‌ల్గేరియాలో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ హైద‌రాబాద్ కి తిరిగొచ్చారు.. ఈ నెల 26 నుంచి మ‌ళ్లీ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ కి వెళ‌తార‌ని తెలుస్తోంది.