Begin typing your search above and press return to search.

బుల్లి తెర ప్రేక్షకులకు ఆ రెంటితో పండగ.. మరి రేటింగ్‌?

By:  Tupaki Desk   |   4 Aug 2021 8:03 AM GMT
బుల్లి తెర ప్రేక్షకులకు ఆ రెంటితో పండగ.. మరి రేటింగ్‌?
X
తెలుగు బుల్లి తెరపై బిగ్‌ బాస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు టెలికాస్ట్‌ అయిన నాలుగు సీజన్ లకు కూడా మంచి రేటింగ్‌ దక్కింది. ముఖ్యంగా మొదటి సీజన్‌ ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేయగా మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నట్లుగా బుల్లి తెర వర్గాల టాక్. ఆ తర్వాత వచ్చిన మూడు సీజన్‌ లు కూడా షో నిర్వాహకులు.. మరియు ఛానెల్‌ వారు మంచి లాభాలు దక్కించుకునేలా వ్యూవర్స్ ను దక్కించుకుంది. అలా బుల్లి తెరపై బిగ్‌ బాస్ నాలుగు సీజన్ లు సూపర్‌ హిట్‌ సినిమా మాదిరిగా సూపర్‌ హిట్ షో గా నిలిచింది. ప్రస్తుతం బిగ్‌ బాస్ సీజన్‌ 5 కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కరోనా వల్ల ఈ ఏడాది ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని అనూహ్యంగా ఇటీవలే స్టార్‌ మా వారు బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కు సంబంధించిన ప్రకటన చేశారు. వచ్చే నెలలో సీజన్ 5 టెలికాస్ట్‌ ఖాయం అన్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే కంటెస్టెంట్స్‌ ను ఫైనల్‌ చేసి క్వారెంటైన్‌ కు తరలించే పనులు జరుగుతున్నాయట. అతి త్వరలోనే షో కు సంబంధించిన హోస్ట్‌ మరియు డేట్‌ ను ప్రకటించడం ఖాయంగా ఉంది. బిగ్‌ బాస్ సీజన్‌ 5 కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న ఈ సమయంలో మరో వైపు జెమిని టీవీ వారు ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ను రంగంలోకి దించబోతున్నారు.

ఇప్పటికే షూటింగ్ జరిగిన ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సంబంధించిన తేదీని కూడా ప్రకటించబోతున్నారు. ఈ నెలలోనే ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రారంభం కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్‌ షో కనుక ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్‌ రేటింగ్‌ వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మూడవ లేదా నాల్గవ వారంలో ఎన్టీఆర్ షో ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ షో టెలికాస్ట్‌ అయిన తర్వాత కాస్త అటు ఇటుగా నెల రోజులకు బిగ్‌ బాస్ సీజన్ 5 కూడా మొదలు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

రెండు షో లు కూడా ప్రైమ్‌ టైమ్‌ లోనే టెలికాస్ట్‌ అవ్వడం ఖాయం. అంటే రెండు కూడా ప్రతి రోజు రాత్రి సమయంలో అర్థ గంట అటు ఇటుగా లేదంటే ఒకే సమయంలో టెలికాస్ట్‌ అవ్వబోతున్నాయి. రెండు పెద్ద షో లు ఒకే సారి బుల్లి తెర పై టెలికాస్ట్‌ అవ్వడం అంటే ఖచ్చితంగా ప్రేక్షకులకు కన్నుల పండుగ అనడంలో సందేహం లేదు. అద్బుతమైన ఈ రెండు షో లు క్లాష్‌ అవ్వడం వల్ల రెండింటి రేటింగ్‌ విషయంలో మార్పు వస్తుంది. ప్రేక్షకులు ఈ రెండు షో లను చూడాలనే అనుకుంటారు. కనుక ఒకే సమయంలో రెండు షో లు ఉన్నప్పుడు మాత్రం ప్రేక్షకులు ఎక్కువ శాతం ఒకే షో చూడ్డానికి ఆసక్తి చూపిస్తారు.

బిగ్‌ బాస్ వీక్‌ డేస్ లో కంటెస్టెంట్స్ మాత్రమే కనిపిస్తారు. కాని ఎవరు మీలో కోటీశ్వరులు షో లో ప్రతి రోజు కూడా ఎన్టీఆర్‌ కనిపిస్తాడు కనుక బుల్లి తెర ప్రేక్షకులు ఎక్కువ శాతం ఎన్టీఆర్ షో ను చూసేందుకు ఆసక్తి చూపిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్‌ షో మరియు బిగ్‌ బాస్‌ ల మద్య బిగ్‌ క్లాష్‌ తప్పదని ఇండస్ట్రీ వర్గాల కామెంట్స్‌. ఖచ్చితంగా ఈ రెండు షో లు మాత్రం ప్రేక్షకులకు మస్త్‌ ఎంటర్ టైన్‌ మెంట్‌ అందిస్తాయి అనడంలో సందేహం లేదు.