Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ షో పోటీ తట్టుకోవడం కోసం బిబి5 లో అది కాస్త ఎక్కువ!!
By: Tupaki Desk | 4 Aug 2021 4:30 PM GMTతెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న షో బిగ్ బాస్ సీజన్ 5 వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది సీజన్ 5 ఉంటుందా లేదా అనే అనుమానాలకు తెర దించుతూ బిగ్ బాస్ సీజన్ 5 లోగోను విడుదల చేశారు. అతి త్వరలోనే హోస్ట్ ను కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేసి ప్రోమోను విడుదల చేయబోతున్నారు. మొదటి నాలుగు సీజన్ లకు పోటీ అనేది లేకుండా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. వీక్ డేస్ మరియు వీకెండ్స్ లో షో కు మంచి రేటింగ్ దక్కింది. అయితే ఈసారి మాత్రం ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రసారం కాబోతుంది. ఆ షో మరియు బిగ్ బాస్ షో ఒకే సమయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. కనుక ఎన్టీఆర్ షో మరియు బిగ్ బాస్ షో లు ప్రతి రోజు వస్తాయి.. అది కాకుండా ప్రైమ్ టైమ్ అయిన రాత్రి 9 గంటల సమయంలోనే వచ్చే అవకాశం ఉంది. కనుక ఎన్టీఆర్ షో ముందు బిగ్ బాస్ షో కాస్త తేలిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బిగ్ బాస్ షో ను ప్రేక్షకులు చూడాలంటే ఖచ్చితంగా ఏదైనా ప్రత్యేక ఎలిమెంట్స్ ఉండాలి. అందుకే బిగ్ బాస్ లో ఈసారి గ్లామర్ డోస్ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
గత సీజన్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఎలిమెంట్ వల్ల అయితే షోను జనాలు ఫాలో అవుతున్నారో ఆ పాయింట్ ను మరింతగా హైలైట్ చేయాలనుకుంటున్నారు. అదేనండి రొమాన్స్ మరియు లవ్ ట్రాక్ లు... ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కాస్త ఎక్కువ రొమాన్స్ ను మరియు అందాలను చూస్తామని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈసారి ముద్దుగుమ్మలు ఎక్కువ మంది స్కిన్ షో చేసేందుకు సిద్దం అవుతున్నారట. ఈ సీజన్ 5కు ముద్దుగుమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు రొమాన్స్ లు లవ్ ట్రాక్ లు కూడా ముందుగానే సిద్దం చేస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.