Begin typing your search above and press return to search.

జూనియర్ సమంతతో ప్రదీప్

By:  Tupaki Desk   |   13 March 2017 11:51 AM GMT
జూనియర్ సమంతతో ప్రదీప్
X
ఆషు రెడ్డి అంటే జూనియర్ సమంతగా ఇప్పటికే ఫేమస్ అయిపోయింది. ఏ యాంగిల్ లో చూసినా సమంతలాగే కనిపించే ఈమె.. సమంత సీన్స్ కు డబ్ స్మాష్ లు చేసి.. వాటిని నెట్ లో పెట్టేసి.. మరింత పాపులర్ అయిపోయంది.

స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించిన ప్రదీప్ తో కలిసి.. ఆషు రెడ్డి చేసిన ఓ డబ్ స్మాష్ ఇప్పుడు ట్రెండింగ్ అయిపోతోంది. అ..ఆ.. మూవీలో సమంత.. చమ్మక్ చంద్ర మధ్య వచ్చే కామెడీ సీన్ కు డబ్ స్మాష్ చేశారు ప్రదీప్-ఆషు రెడ్డి. సమంత టైపులో హొయలు పోతూ ఆషు ఇరగదీసేసేసింది. బావా.. అంటూ పిలిచేటపుడు సమంత ఏ రేంజ్ లో కులుకులు చూపించిందో.. ఆషు అంతకు మించి ట్రై చేసేసింది.

'పిలుస్తున్నారండీ'.. 'రావా.. అనుకున్నానండీ' అంటూ ప్రదీప్ కూడా చమ్మక్ చంద్ర రోల్ ను కుమ్మేశాడు. అ..ఆ.. మూవీలో ఈ సీన్ ఎంతగా అలరించిందో.. వీళ్లిద్దరూ చేసిన డబ్ స్మాష్ కూడా ఆ రేంజ్ లోనే ఆకట్టుకోవడం విశేషం.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/