Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ జయంతి: తాతకు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

By:  Tupaki Desk   |   28 May 2022 5:30 AM GMT
ఎన్టీఆర్ జయంతి: తాతకు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
X
నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, గొప్ప నటుడు నందమూరి తారకరామారావు శత జయంతి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి ఘన నివాళులర్పించారు. ఈ రోజు ఉదయం వేకువజామునే అభిమానుల సందడి తక్కువగా ఉన్న సమయంలో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మరో హీరో కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి దంపతులు సందర్శించి నివాళులర్పించారు.

తాత ఎన్టీఆర్ ను తలుచుకొని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు నివాలులర్పించారు. ఉదయం నుంచే రద్దీ ఉండడంతో ఈ ఇద్దరు హీరోలు వచ్చి నివాళులర్పించి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇక అభిమానులు ఉదయం నుంచే ఎన్టీఆర్ ఘాట్ కు క్యూ కట్టారు. ఈసారి శత జయంతి కావడంతో మరింతమంది ఎన్టీఆర్ ఘాట్ కు విచ్చేస్తున్నారు.

ఈసారి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తున్నారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని హైదరాబాద్ నెక్లస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ను నిన్న రాత్రే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద హడావుడి కొనసాగింది.

నివాళులర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ‘తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన ప్రతిభ కలిగిన నటుడు అని.. మాట తప్పని.. మడమ తిప్పని రాజకీయ నాయకులుగా పేరుగాంచాడని తెలిపారు. తెలుగు సినిమా ఉన్నం తకాలం ఎన్టీఆర్ పేరు ఉంటుందని ఆమె అన్నారు.

ఇక ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడారు. శతజయంతి ఉత్సవాలను మే 28 నుంచి ఏడాది పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెనాలి