Begin typing your search above and press return to search.
బ్రహ్మాస్త్ర కోసం భీమ్ ని దించేస్తున్నారు!
By: Tupaki Desk | 27 Aug 2022 7:45 AM GMTరాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ 'RRR'. 1920 ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్రలో నటించిన అబ్బుర పరిచిన విషయం తెలిసిందే.
ఈ పాత్రలో ఎన్టీఆర్ పలికించిన అభినయానికి యావత్ ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ ప్రేక్షకులే కాకుండా మాలీవుడ్ నటులు, టెక్నిషియన్స్, విదేశీ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ నటనకు మంత్ర ముగ్ధులయ్యారు.
త్వరలో జరగనున్న ఆస్కార్ అవార్డుల్లో ఎన్టీఆర్ ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశాలు వున్నాయని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 'RRR'తో యావత్ వరల్డ్ వైడ్ గా భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ని 'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్ కోసం రాజమౌళి రంగంలోకి దింపుతుండటం ఆసక్తికరంగా మారింది. అమీతాబ్ బచ్చన్, రణ్ బీర్ కపూర్, నాగార్జున, అలియా భట్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు.
హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ సెప్టెంబర్ 9న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ మూవీని ఉత్తాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులకు కూడా చేరువ చేయాలనే ఆలోచనతో 'బ్రహ్మాస్త్ర' టీమ్ గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే హైదరాబాద్ లో సెప్టెంబర్ 2న భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర బృందం ప్లాన్ చేసింది.
రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇందు కోసం ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాల్గొన బోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ఓ వీడియోని విడుదల చేస్తూ ప్రకటించింది. ఈ మూవీకి తెలుగులో దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జక్కన్న ఎన్టీఆర్ ని రంగంలోకి దింపేస్తున్నాడని చెబుతున్నారు.
ఇటీవల నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొని ఈమూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మరింత నమ్మకాన్ని, జోష్ ని నింపారు. అదే సినిమా ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సేమ్ అదే ఫీట్ ని 'బ్రహ్మస్త్ర' విషయంలోనూ రిపీట్ చేయాలని ప్లాన్ చేసిన రాజమౌళి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ని రంగంలోకి దింపుతుండటం ఆసక్తికరంగా మారింది.