Begin typing your search above and press return to search.
నేనే ప్రేమించా.. నేనే వద్దంటున్నా..
By: Tupaki Desk | 30 Oct 2017 4:15 PM GMTఇప్పటివరకు వెండి తెరపై ఎన్నో లవ్ స్టోరీలు వచ్చాయి. ఇంకా వస్తుంటాయి కూడా.. ఇది సినిమా కథలకి ఫార్ములా కాదు.. కథ డిమాండ్ చేసే ఒక రూల్. హీరో హీరోయిన్ ఉండే ఎలాంటి కథకైనా లవ్ సీన్స్ ని కాన్సెప్ట్ పెట్టమంటోంది. ఆ రూల్ ఫాలో అవ్వాలి కానీ కాన్సెప్ట్ కి కొత్త తరహా ఫార్ములా కూడా అక్కడా ఉపయోగిస్తే కొంచెం కొత్తగా ప్రేమను చూపించవచ్చు. అదే తరహాలో ఇప్పుడు మన యువ దర్శకులు తెగ ట్రై చేస్తున్నారు.
అజయ్ దర్శకత్వంలో నవీన్ చంద్ర - నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. కథ రొటీనే అయినా కథనం కాస్త కొత్తగా ఉన్నట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా మాటలు ట్రైలర్ కి బూస్ట్ ని ఇచ్చాయని చెప్పాలి. 'ఒక అబ్బాయి.. ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఇష్టపడి వెంటపడి.. తన ఇష్టాయిష్టాలు తెలుసుకుని.. దానికి తగ్గట్టుగా వాడి లైఫ్ స్టయిల్ మార్చుకుని.. ప్రతి నిమిషం తనను ఎలా ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేస్తూ.. ప్రతి క్షణం తన గురించే ఆలోచిస్తూ మా కెరీర్, ఫ్యూచర్ మొత్తం మీ ప్రేమకు పణంగా పెడితే మీరేమంటారు.. ‘డాడీ నిన్ను ఓసారి కలవమన్నారు. ఒరేయ్ బంగారం, పండు మన పెళ్లికి మా అమ్మానాన్నల్ని ఒప్పిస్తావుగా’’ అని హీరో నవీన్ చెప్పిన డైలాగ్ కొంచెం కొత్తగానే ఉంది.
అంతే కాకుండా 'నేనే ప్రేమించాను.. నేనే వెంటపడ్డాను.. నేనే వద్దంటున్నాను. నీకేంటి ప్రాబ్లమ్’ అని ప్రియురాలి తో చెప్పడం కథకు కొంచెం బేస్ లాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉందని కూడా చెప్పవచ్చు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.