Begin typing your search above and press return to search.

జూనియ‌ర్ అనుష్క మ‌ళ్లీ వ‌స్తోంది!

By:  Tupaki Desk   |   23 Sept 2015 12:56 PM IST
జూనియ‌ర్ అనుష్క మ‌ళ్లీ వ‌స్తోంది!
X
కాటుక క‌ళ్లు - తీరైన ముక్కు .. ముఖాకృతి.. ఎక్స్‌ ప్రెష‌న్ ఇలా ఏ కోణంలో చూసినా అనుష్క‌ను పోలి క‌నిపిస్తుంది సుష్మా రాజ్‌. స‌రిగ్గా ఇవే క్వాలిటీస్ అమ్మ‌డిని హీరోయిన్‌ని చేశాయి. అయితే ఈ భామ‌కి టాలీవుడ్‌ లో స‌రైన లాంచ్ ప్యాడ్ దొర‌క‌లేద‌నే చెప్పాలి. ఆరంభ‌మే నీల‌కంఠ మాయ చిత్రంలో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నా, ఆ త‌ర్వాత‌ సందీప్‌కిష‌న్ స‌ర‌స‌న న‌టించిన ఫ్లాప్ ఫిలిం బ్యాడ్‌ నేమ్ తెచ్చింది. కార‌ణం ఏదైనా సుష్మ కెరీర్‌ లో వెన‌క‌బ‌డింది. ఆ క్ర‌మంలోనే త‌మిళ్‌ లో వైభ‌వ్ స‌ర‌స‌న జిందా చిత్రం లో న‌టించింది. ఇప్పుడు తెలుగు లో స్టార్ హీరో తో ఛాన్స్ కావాలి అనుకుంటుంటే స్టార్ హీరోయిన్‌ తో ఛాన్స్ అందుకుంది. డీటెయిల్స్ లోకి వెళితే..

ప్ర‌స్తుతం ఈ బెంగ‌ళూరు బాలిక‌కు తెలుగు - త‌మిళ్‌ లో మెగా ఛాన్సులు కావాలి. స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశం కావాలి. ఇలాంటి టైమ్‌ లో .. అంత పెద్ద ఆఫ‌ర్ త‌గ‌ల‌క‌ పోయినా చెప్పు కోవ‌డాని కి ఓ ఛాన్స్ దొరికిందిక్క‌డ‌. ఈ అమ్మ‌డు త్రిష టైటిల్ పాత్ర‌ లో న‌టిస్తున్న నాయ‌కి చిత్రంలో ఓ కీరోల్‌ లో ఛాన్స్ అందుకుంది. ఈ విష‌యాన్ని సుష్మా ఎంతో ఎగ్జ‌యిటింగ్‌ గా చెబుతోంది. మాయ చిత్రంలో న‌ట‌న న‌చ్చి గోవి ఈ క్యారెక్ట‌ర్‌ లో ఛాన్సిచ్చాడు. గోవి తో చాలా కాలంగా ప‌రిచ‌యం ఉంది. అదే అవ‌కాశం తెచ్చింద‌ని తెగ మురిసిపోతోంది.

అయినా సుష్మ కెరీర్ జెట్ స్పీడ్ అందుకోవాలంటే కాస్త స్టార్‌డ‌మ్ ఉన్న హీరోల దృష్టిలో ప‌డాలి కానీ ఇలా ఓ హీరోయిన్ సినిమాలో స‌హాయ‌క‌పాత్ర‌లో న‌టిస్తే ఆ స్టార్‌డ‌మ్ వ‌స్తుందా? అన్న‌ట్టు ఈ అమ్మ‌డు తెలుగు - త‌మిళ్ పుష్క‌లంగా మాట్లాడ‌గ‌ల‌దు. పేరుకి బెంగ‌ళూరు అమ్మాయి అని అనుకుంటారే కానీ, నేనూ తెలుగు అమ్మాయినే అంటూ చెబుతోంది. ఓ ర‌కంగా తెలుగ‌మ్మాయి అని తెలియ‌క‌పోవ‌డ‌మే క‌లిసొచ్చింద‌ని అంటోంది. తెలుగ‌మ్మాయికి తెలుగులో ఛాన్సులుండవ్ కాబ‌ట్టి ఈ అమ్మ‌డికి అదో ప్ల‌స్ అన్న‌మాట‌!