Begin typing your search above and press return to search.
జూనియర్ దేవరకొండ.. ఎందుకు ఈ సైలెన్స్?
By: Tupaki Desk | 4 Feb 2020 7:39 AM GMTక్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' చిత్రంతో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం ఒక సెక్షన్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ ఫలితం మాత్రం నిరాశపరిచింది. అయితే ఆ ఫ్లాప్ తో నిరాశ పడకుండా జూనియర్ దేవరకొండ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే వాటికి సంబంధించిన అప్డేట్స్ మాత్రం రావడం లేదు.
'దొరసాని' తర్వాత నూతన దర్శకుడు వినోద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడని అన్నారు. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తారని అన్నారు. అయితే ఆ సినిమా అసలు లాంచ్ అయిందో లేదో తెలియదు. ఈమధ్య కొన్ని సినిమాలకు పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. అయితే కొత్త హీరోల సినిమా విషయం అయితే దాచి పెట్టడం వీలవుతుంది కానీ విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమా కాబట్టి వివరాలు బయటకు రాకుండా ఉండవు.
ఈ సినిమానే కాదు..1990 ల సినిమా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిలిం 'తాళి' రీమేక్ చేయబోతున్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి కూడా అప్డేట్స్ ఏమీ లేవు. మరి చిన్న రౌడీగారు ఏం చేస్తున్నట్టు? ఆనంద్ అన్నయ్య విజయ్ తన సినిమాలకు ప్రమోషన్స్ చేసుకోవడంలో కొత్త టెక్నిక్స్ వాడుతూ ఉంటాడు. మరి అన్నయ్యను చూసి మీడియా లైమ్ లైట్ లో ఎలా ఉండాలో నేర్చుకోకపోతే ఎలా ఆనందూ?