Begin typing your search above and press return to search.
డైలాగ్ చిన్నదే అయినా.. డైలెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలంటున్న ఎన్టీఆర్..!
By: Tupaki Desk | 23 Nov 2022 7:16 AM GMT'టెంపర్' తో ట్రాక్ మార్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. RRR సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత తారక్ సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. భీమ్ గా ఆయన అభినయానికి అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్ చూసి పలు కార్పొరేట్ కంపెనీలు తమ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఎన్టీఆర్ తన సినిమాలతో వెండి తెర మీద అలరిస్తూనే.. హోస్ట్ గా బుల్లితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే. అలానే కమర్షియల్ యాడ్స్ లోనూ తారక్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పటికే నవరత్న ఆయిల్ - యాపీ ఫిజ్ వంటి పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తగా ఉన్న అగ్ర హీరో ఖాతాలోకి ఇప్పుడు లేటెస్టుగా మరో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది. పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ "లిసియస్ ఫుడ్స్" తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియమించుకుంది.
తారక్ ఇటీవలే లిసియస్ బ్రాండ్ ఎండార్స్మెంట్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ షేర్ చేసిన ఫొటోలోని న్యూ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. 'జరగబోయే సంచనలం ఊహించగలరా?'.. 'బాక్ బస్టర్ ఎంట్రీ వస్తుంది. స్పెషల్ ఎంట్రీ త్వరలో' అంటూ ఎన్టీఆర్ యాడ్ పై నిర్వాహకులు ఆసక్తిని కలిగించారు. ఈ క్రమంలో తాజాగా యాడ్ ని ఆవిష్కరించారు.
లిసియస్ యాడ్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ తరహాలో డిజైన్ చేయబడింది. బోనులో నిల్చున్న తారక్ 'ఇంపాజిబుల్ యువర్ ఆనర్.. ఇంపాజిబుల్ యువర్ ఆనర్' అంటూ డైలాగ్ ను పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. దీంతో డైరెక్టర్ గా కనిపించిన రాహుల్ రవీంద్ర ఆశ్చర్యంగా చూస్తున్నాడు. 'ఆరు పేజీల డైలాగైనా అర సెకన్లో చెప్పగలుగుతారు.. మీకు ఇంత చిన్న డైలాగ్..' అంటూ రాహుల్ భయం భయంగా అన్నాడు.
దీనికి ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. 'చేప చిన్నదే అయినా.. ఎర పెద్దది వేయాలి' అంటూ లిసియస్ ఫుడ్ యాప్ లో దొరికే చేపల గురించి వివరించారు. 'డైలాగ్ చిన్నదే అయినా.. డిలెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి' అంటూ తారక్ యాడ్ ని ముగించారు. ఇప్పుడు ఈ వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ మేకోవర్ - న్యూలుక్ మరియు డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగాలు నిర్వహిస్తారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేయనున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ - కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనుంది. దీని తరవాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ఓ ప్రాజెక్ట్ కోసం జతకట్టనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.