Begin typing your search above and press return to search.
నేనున్నా అన్న మీకు.. విషాద సమయంలో ఎన్టీఆర్ మాటలు
By: Tupaki Desk | 12 Nov 2021 6:10 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన అనుకున్న వాళ్ల కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్దం అంటాడు. ఇటీవల పునీత్ రాజ్ కుమార్ మృతి వార్త తెలిసిన వెంటనే
ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో పునీత్ రాజ్ కుమార్ మృత దేహంను చూసి ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ ను ఎన్టీఆర్ ఓదార్చారు. ఎన్టీఆర్ తో పాటు ఇంకా ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పునీత్ రాజ్ కుమార్ కు నివాళ్లు అర్పించారు. బాలకృష్ణ ఏకంగా గుండెలు బాదుకుంటే కన్నీరు పెట్టుకోవడం అందరిని కలచి వచేసింది. పునీత్ రాజ్ కుమార్ మృతితో అన్న శివ రాజ్ కుమార్ శోకంతో క్రుంగిపోయారు.
తమ్ముడు చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత శివ రాజ్ కుమార్ ఒక మీడియా సంస్థ ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ్ముడు మృతితో కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఎన్టీఆర్ గురించి కూడా శివ రాజ్ కుమార్ ప్రస్థావించాడు. ఆ రోజు ఎన్టీఆర్ నా వద్దకు వచ్చి నేనున్నా అన్న మీకు అంటూ ధైర్యంగా నిలిచాయని శివ రాజ్ కుమార్ అన్నాడు. ఎన్టీఆర్ పై తనకు ఉన్న అనుబంధం మరియు అభిమానంను శివ రాజ్ కుమార్ తెలియజేశారు. బాధలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ స్పందించే తీరు మరో సారి ప్రశంసనీయంగా మారింది. శివ రాజ్ కుమార్ కు ఆ సమయంలో నేనున్నా అన్నయ్య అంటూ అండగా నిలవడం మంచి విషయం అంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ కు కన్నడ సినిమా ఇండస్ట్రీతో.. కర్ణాటకతో సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఎంత చక్కగా కన్నడ మాట్లాడుతాడో తెల్సిందే. పునీత్ రాజ్ కుమార్ కోసం ఒక పాటను కూడా కన్నడంలో ఎన్టీఆర్ పాడి అక్కడి వారిని తన గొంతుతో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ తో థమన్ ఆ పాటను పునీత్ రాజ్ కుమార్ సినిమాలో పాడించాడు. పెద్ద ఎత్తున సక్సెస్ అయిన ఆ పాట తర్వాత పునీత్ మరియు ఎన్టీఆర్ ల మద్య బంధం మరింతగా పెరిగినట్లయ్యింది. ఈ బంధం ఇప్పటిది కాదని.. అప్పటి రాజ్ కుమార్ మరియు సీనియర్ ఎన్టీఆర్ నుండి కొనసాగుతూ ఉంది.
ఆ అనుబంధంను వారి వారసులు కూడా కొనసాగిస్తూ రావడం మంచి పరిణామం. ఇక ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతో వస్తోంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ వర్కౌట్స్ చేస్తున్న సమయంలో చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ అంతా బాగానే ఉన్నాడు. రెండు నెలల పాటు వర్కౌట్స్ కు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ కు వైధ్యులు సూచించారట. ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదిలో విడుదల కాబోతుంది. అదే సమయంలో కొరటాల శివ మూవీ కూడా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.