Begin typing your search above and press return to search.
హాలీవుడ్ సీక్వెల్స్.. పేరు గొప్ప ఊరు దిబ్బ!
By: Tupaki Desk | 9 July 2015 1:30 PM GMTసీక్వెల్స్ తీయడంలో హాలీవుడ్ డైరెక్టర్స్‌కు ఇంకెవరూ సాటి రారు. కొత్త కాన్సెప్ట్‌తో ఓ సినిమా హిట్టయిందంటే చాలు.. ఆ సిరీస్‌లో 1, 2, 3, 4, 5.. ఇలా సీక్వెల్స్ వరుస కట్టేస్తాయి. జనాలకు మొహం మొత్తేవరకు సీక్వెల్స్ తీస్తూనే ఉంటారు. హారీపోట్టర్ సిరీస్‌లో ఏకంగా ఏడు సినిమాలు రావడం విశేషం. ఐతే చివరి పార్ట్‌తో జనాలకు విసుగొచ్చేయడంతో ఆ సిరీస్‌కు తెర దించేశారు. గత నెల రోజుల్లో రెండు ఫేమస్ సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. ఐతే అవి రెండూ ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. కలెక్షన్ల లెక్కలు ఎంత గొప్పగా అయినా ఉండొచ్చు కానీ.. కంటెంట్ విషయంలో మాత్రం ఆ రెండు సినిమాలూ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్లు తయారయ్యాయి.
జురాసిక్ పార్క్ సిరీస్‌లో భాగంగా సుదీర్ఘ విరామం తర్వాత నాలుగో భాగం 'జురాసిక్ వరల్డ్' గత నెల విడుదలైంది. కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా ఎన్నో రికార్డుల్ని తిరగరాసింది. ఇండియాలో కూడా వంద కోట్ల దాకా కొల్లగొట్టింది. కానీ క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాను చెత్త అని తేల్చేశారు. రాకాసి బల్లి తప్పించుకోవడం.. అరాచకం సృష్టించడం.. చివరికి దాన్ని ఎలాగోలా పట్టుకుని హమ్మయ్యా అనుకోవడం.. ఇలాంటి మొహం మొత్తేసిన కథతో జనాలకు విసుగు పుట్టించారు. గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ మాయాజాలంతో పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ.. కంటెంట్ పరంగా మాత్రం జురాసిక్ వరల్డ్ తీవ్రంగా నిరాశ పరిచిందన్నది వాస్తవం. ఇక గత శుక్రవారం టెర్మినేటర్ సిరీస్‌లో భాగంగా వచ్చిన 'జెనిసిస్' అయితే తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఇంతకుముందు వచ్చిన మూడో భాగం వేస్ట్ అని.. ఆర్నాల్డ్ మళ్లీ నటించడంతో టెర్మినేటర్‌కు మళ్లీ కళ వచ్చిందని.. ఇది అసలైన టెర్మినేటర్ మూవీ అని నిర్మాత జేమ్స్ కామెరూన్ గొప్పలు చెప్పినా.. సినిమాలో అంత విషయం లేదని తేలిపోయింది. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పెద్దగా లేవు. చాలా రొటీన్ కథాకథనాలతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షులు కూడా తిరస్కరించారు