Begin typing your search above and press return to search.
జురాసిక్ వరల్డ్.. ఇక్కడే ముందట
By: Tupaki Desk | 8 May 2018 7:09 AM GMTభారతీయులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో హాలీవుడ్ వాళ్లకి కచ్చితంగా తెలుసు. తెర నిండా అబ్బురపరిచే గ్రాఫిక్స్ వర్క్ నింపేసి... కొన్ని యాక్షన్ సీన్లు పెడితే చాలు... పిల్లలతో పాటు పెద్దలు కూడా సినిమా చూడడానికి ఎగబడతారు. కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. అందుకే రోజురోజుకీ పెరిగిపోతున్న ఇండియన్ మార్కెట్ పై ప్రత్యేకంగా కన్నేశారు ఇంగ్లీష్ జనాలు. కాసుల కోసం అక్కడి కంటే ముందే ఇక్కడ వాలిపోతున్నారు.
ఇప్పుడు అక్కడి కంటే రెండు వారాల ముందే ఇక్కడి వాళ్లకి ‘జురాసిక్ వరల్డ్ 2’ చూపించబోతున్నారు. అవును అమెరికా జనాల కంటే రెండు వారాల ముందే ఇక్కడ విడుదల కాబోతోంది 2015లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ సీక్వెల్ చిత్రం ‘జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్ డమ్’. ఇప్పటికే ‘అవెంజర్స్- ఇన్ఫినిటీ వార్’ సినిమా ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వంద కోట్ల వసూళ్లు సాధించడానికి ముప్పు తిప్పలు పడుతుంటే... ఇప్పటికే దేశవ్యాప్తంగా 187 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన ‘అవెంజర్స్- ఇన్ఫినిటీ వార్’ వచ్చే వారంలోగా 200 కోట్ల వసూళ్లను అధిగమించబోతోంది. ఈ సినిమా దెబ్బకి తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాపై దెబ్బ పడితే... బాలీవుడ్లో అమితాబ్ ‘102 నాటవుట్’ చిత్రానికి వసూళ్లే కరువయ్యాయి.
దీంతో ఇప్పటికే అమితాబ్... హాలీవుడ్ ప్రాంతీయ భాషా సినీ పరిశ్రమలను దెబ్బతిస్తోందంటూ వాపోయారు కూడా. ఇప్పుడు జురాసిక్ పార్క్ సినిమా ఏకంగా దేశవ్యాప్తంగా 2800 థియేటర్లలో నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నారు. జూన్ 8న విడుదల కాబోతున్న ఈ హాలీవుడ్ అద్భుతం ఎన్ని భారతీయ చిత్రాల వసూళ్లను దెబ్బకొడుతుందో... ఎన్ని వందల కోట్లు వసూళ్లు చేస్తోందో ఆసక్తికరంగా మారింది.