Begin typing your search above and press return to search.
పోసాని వ్యాఖ్యల నేపథ్యంలో ట్రెండింగ్ లో #JusticeForPunjabiGirl
By: Tupaki Desk | 28 Sep 2021 7:37 AM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి ఇతర మంత్రులపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో పవన్ పై ప్రతి విమర్శలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అనే విధంగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ నోట్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం పట్ల పరిశ్రమ సంతోషంగా ఉందని తెలిపింది. ఈ క్రమంలో సోమవారం సినీ ప్రముఖులు పోసాని కృష్ణ మురళి కూడా పవన్ ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని.. వైఎస్ జగన్ తో పోల్చుకునే అర్హత పవన్ కు లేదని పోసాని కృష్ణ మురళి అన్నారు.
పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పోసాని.. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం మాని, ఇండస్ట్రీలో ఓ ప్రముఖుడి చేతిలో మోసపోయిన పంజాబీ అమ్మాయికి న్యాయం చేయమని సూచించారు. ''ఓ పంజాబీ అమ్మాయి ఎన్నో కలలతో తెలుగు పరిశ్రమకు వచ్చి ఇక్కడ హీరోయిన్ గా అవకాశాల కోసం ట్రై చేసింది. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖుడు అవకాశం ఇస్తానని ఆ అమ్మాయిని నమ్మించి మోసం చేసి, కడుపు చేసి.. అబార్షన్ చేయించుకో అని బెదిరించాడు. ఈ విషయం బయటపెడితే నిన్ను కనపడకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చాడని.. అలా ఆ అమ్మాయిని హాస్పిటల్ కు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడని నేను విన్నాను. పవన్ కల్యాణ్ ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఆ బాధితురాలికి న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ కు గుడి కట్టి పూజలు చేస్తా'' అని పోసాని అన్నారు.
పబ్లిక్ గా ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు కాబట్టి.. పవర్ ఫుల్ స్టార్ కనుక పవన్ కళ్యాణ్ చెవిలో ఆమె పేరు చెబుతానని పోసాని అన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు #JusticeForPunjabiGirl అనే హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున పోస్ట్‌లను షేర్ చేయడం ప్రారంభించారు. పంజాబీ అమ్మాయి పేరు మెన్షన్ చేయకుండా పవన్ ను ట్రోల్ చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో #JusticeforPunjabiGirl అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఇటీవల యాక్సిడెంట్ లో మరణించిన సినీ క్రిటిక్ మహేష్ కత్తి కూడా గతంలో అదే సంఘటన గురించి పలు అంశాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే.