Begin typing your search above and press return to search.

జ్వాల విరహజ్వాలతో రగిలి పోతుందట

By:  Tupaki Desk   |   29 March 2020 5:30 PM GMT
జ్వాల విరహజ్వాలతో రగిలి పోతుందట
X
ఇండియా స్టార్‌ షట్లర్‌ గుత్తా జ్వాల గత కొన్ని రోజులుగా తమిళ నటుడు విష్ణు విశాల్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఇంతకు ముందే పెళ్లి అయిన విష్ణు విశాల్‌ తో గుత్తా జ్వాల ప్రేమ వ్యవహారం నడిపిందనే ప్రచారం కూడా జరిగింది. గుత్తాతో ప్రేమ కారణంగా విష్ణు తన భార్యకు విడాకులు ఇచ్చాడనే విషయం కూడా తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. విష్ణుతో ప్రేమ విషయమై ఈమె గతంలో ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

పెళ్లి విషయమై ప్రస్తుతం ఆలోచన లేదని ప్రస్తుతానికి ఇద్దరం కూడా డేటింగ్‌ లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. వీరిద్దరు తరచు కలుస్తూ ఉండేవారు. కాని ఇప్పుడు కరోనా కారణంగా ఇద్దరు వేరు వేరు ప్రాంతాల్లో ఉండి పోయారట. దాంతో గుత్తా జ్వాల విరహ వేదనతో రగిలి పోతున్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె మిస్‌ యూ అంటూ విష్ణు విశాల్‌ తో క్లోజ్‌ గా ఉన్న ఫొటోలను ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌ కాస్త వైరల్‌ అవ్వడంతో నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

కరోనా ఎందరికో ఎన్నో సమస్యలు తెచ్చి పెట్టింది. కొందరికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో నీవు అతడిని మిస్‌ అవుతున్నట్లుగా పోస్ట్‌ పెట్టావు. ఇక్కడే నీవు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నావు అనే విషయం అర్థం అవుతుంది అంటూ మరికొందరు నెటిజన్స్‌ గుత్తా జ్వాల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విష్ణు విశాల్‌ ఫొటోలు ట్వీట్‌ చేసిన గుత్తా జ్వాల టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా నిలిచింది.