Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: జ్యో..అచ్యుతా..నంద..
By: Tupaki Desk | 22 Aug 2016 4:02 AM GMTశ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం జ్యో అచ్యుతానంద. నారా రోహిత్.. నాగశౌర్య హీరోలుగా.. యంగ్ బ్యూటీ రెజీనా హీరోయిన్ నటించిన ఈ మూవీకి.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా ప్రయత్నం చేశాడు దర్శకుడు.
సింపుల్ గా చెప్పేసుకోవాలంటే అన్నాదమ్ములు అచ్యుతా.. నంద. వీరిద్దరూ కలిసి లైన్ వేసే అమ్మాయే జ్యో. ఇద్దరితో క్లోజ్ గానే ఉంటుంది.. ఇద్దరితోనూ కబుర్లు చెబుతుంది.. అటొకరు.. ఇటొకరు ఉండగా.. ముగ్గురూ కలిసి తెగ చక్కర్లు కొట్టేస్తూ ఉంటారు. పాటలైనా.. సీన్స్ అయినా.. టూర్లయినా.. అన్నిటికీ ముగ్గురూ కలిసే వెళ్లిపోతుంటారు. కుర్రాళ్లిద్దరూ ఎవరికి వారు తమకే జ్యో పడిపోతుందని అంటూ ఉంటారు. ట్రయాంగ్యులర్ లవ్ స్టోరీలు చాలానే వచ్చాయ్ కానీ.. ఇలా బ్రదర్స్ ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయికి ట్రై చెయ్యడం.. అది కూడా కలిసికట్టుగా ప్రయత్నించడం అంటే కొత్త పాయింటే.
ట్రైలర్ లో మాటలు పాటలతో పాటు.. పిక్చరైజేషన్ కట్టిపడేస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల టేస్ట్.. జ్యో అచ్యుతానంద ట్రైలర్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. లుక్ విషయంలో కూడా ముగ్గరూ తమ పాత సినిమాలకు భిన్నంగా కనిపించేందుకు ట్రై చేశారు. ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది కాబట్టి.. రొమాన్స్.. ఎంటర్టెయిన్మెంట్ ఢోకా లేకపోతే అవసరాలకు మరో హిట్ వచ్చేసినట్లే.