Begin typing your search above and press return to search.
అక్కడ జ్యో సేఫ్ అయితే సూపరే
By: Tupaki Desk | 7 Sep 2016 1:30 PM GMTరీసెంట్ గా పెళ్లి చూపులు మూవీ సాధించిన సక్సెస్.. డిస్ట్రిబ్యూటర్లను-ఎగ్జిబిటర్లను చిన్న సినిమాల వైపు ఆసక్తి కలిగేలా చేసింది. ప్రామిసింగ్ గా ఉన్న లోబడ్జెట్ చిత్రాలకు భారీ మొత్తాలను ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు వెనకాడ్డం లేదు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ ట్రెండ్ బాగా ఎక్కువగా ఉంది. నారా రోహిత్-నాగ శౌర్య హీరోలుగా నటించిన జ్యో అచ్యుతానంద మూవీని.. ఎగ్జిబిటర్లకు భారీ మొత్తానికి అమ్మిందట అక్కడి డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ.
కంటెంట్ పై ఉన్న నమ్మకంతో భారీ మొత్తాన్నే కోట్ చేశాడట సాయి కొర్రపాటి. అయినా సరే ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయిందని తెలుస్తోంది. మూవీ కేస్టింగ్.. బడ్జెట్ ను బట్టి చూస్తే చాలా పెద్ద మొత్తాన్నే వెచ్చించారని.. ఇంత మొత్తం రికవర్ అవడం అంటే.. అదో మిరకిల్ అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే జ్యో అచ్యుతానంద మార్కెటింగ్ కు సంబంధించినంత వరకూ ఆల్ ఇన్ ఆల్ శ్రీనివాస్ అవసరాల మాత్రమే. నారా రోహిత్ కి కానీ.. నాగ శౌర్యకు కానీ ఓవర్సీస్ పెద్దగా మార్కెట్ లేదు. రీసెంట్ గా వీరి చిత్రాలేవీ ఇక్కడ నిలబడలేదు.
అయినా సరే జ్యో అచ్యుతానంద కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఎగ్జిబిటర్లు భారీ మొత్తాన్నే వెచ్చించేశారట. ట్రైలర్లు.. పోస్టర్లు బాగా క్యూరియాసిటీ పెంచేయడంతో ఇంతగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేందుకు సాధ్యమైంది. మరి రిజల్ట్ సంగతి ఏంటో తెలియాలంటే రిలీజ్ డేట్ అయిన 9వ తేదీ వరకూ ఆగాల్సిందే. సినిమా సేఫ్ అయితే మాత్రం సూపరే అంటున్నారు.