Begin typing your search above and press return to search.
డిలే గ్రాఫిక్స్ వలనే.. వేరే ఏమీ కాదు
By: Tupaki Desk | 28 Nov 2017 5:02 PM GMTగత కొంత కాలంగా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ ఏ మాత్రం హిట్ అందుకోవడం లేదు. బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టే స్టామినా ఉన్నా సరైన కథ దొరకకపోవడంతో మినిమమ్ హిట్స్ కూడా అందుకోలేకపోతున్నాడని ఓ వర్గం నుంచి వస్తోన్న టాక్. అయితే చివరగా గౌతమ్ నంద సినిమాతో వచ్చిన గోపి ఆ సినిమా రిజల్ట్ తో చాలా నిరాశచెందాడు. అయితే ఇప్పుడు ఆక్సిజన్ అనే సినిమాతో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే ఈ సినిమా గోపిచంద్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే సినిమా అని దర్శకుడు జ్యోతి కృష్ణ చెబుతున్నాడు.
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జ్యోతి కృష్ణ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది. కొన్ని గ్రాఫిక్స్ పనుల వల్ల కొంచెం ఆలస్యం అయ్యింది. కానీ ఫైనల్ గా అవుట్ ఫుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అయితే ఈ కథ మొదట రాసుకున్నప్పుడు వివేగం దర్శకుడైన శివ తో చెప్పాను. ఆయన కథ చాలా బావుందని గోపిచంద్ కి చెప్పమని ఆయనకు పరిచయం చేయించారు. (గోపిచంద్ తో దర్శకుడు శివ మొదట శౌర్యం - శంఖం సినిమాలు చేశాడు). అయితే గోపిచంద్ గారు కథ వినగానే ఒకే చేశారు. సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఆకట్టుకుంటాయి. గోపి గారు చాలా బాగా నటించారు. ఆయన పాత్ర కూడా మూడు విభిన్న కోణాల్లో ఉంటుంది.. అంటూ చెప్పాడు.
అంతా బాగానే ఉంది కాని.. అసలు ఇప్పటివరకు ఈ సినిమా డిలే అయ్యింది ఫైనాన్షియల్ కారణాల వలన అనుకుంటుంటే.. మనోడు మాత్రం కేవలం గ్రాఫిక్స్ వలనే ఆగింది అనడం.. అంత నమ్మసక్యంగా ఉందంటారా? సర్లేండి ఈసారైనా చెప్పిన డేటుకు సినిమా వచ్చేస్తే చాలు. నవంబర్ 30న ఆక్సిజన్ విడుదలవుతోంది.