Begin typing your search above and press return to search.

సింగర్ గా మారిన డైరెక్టర్ భార్య

By:  Tupaki Desk   |   17 Sept 2017 11:56 AM IST
సింగర్ గా మారిన డైరెక్టర్ భార్య
X
మన దగ్గర చాలా మంది కొత్త కొత్త సింగర్స్ వస్తూనే ఉంటారు. కొత్త తరం సంగీత దర్శకులు వచ్చిన తర్వాత.. పాటలతో ప్రయోగాలు చేస్తూ.. కొత్త స్వరాలను వినిపిస్తున్నారు. యాక్టర్ల నుంచి యాంకర్ల వరకూ అందరూ గాయకులుగా తమ ప్రతిభను చూపించేస్తున్నారు. ఇప్పుడు ఓ దర్శకుడి భార్య కూడా సింగర్ గా అవతరించేయడం విశేషం.

గోపీచంద్ హీరోగా ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఆక్సిజన్. ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైంది కానీ.. మొత్తానికి దీపావళి నాటికి విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు నిర్మాతగా జ్యోతికృష్ణ భార్య ఎస్ ఐశ్వర్య వ్యవహరిస్తున్నారు. ఆమెకు ఎప్పటినుంచో పాటలపై మక్కువ ఉంది. స్వరం కూడా మృదు మధురం కావడంతో.. పలు అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఎందుకనో ఆమె ఎప్పుడూ సింగర్ గా మారేందుకు ప్రయత్నించలేదు. కానీ తన దర్శకత్వంలోనే రూపొందుతున్న సినిమాలో ఆమెతో పాటలు పాడించేందుకు నిర్ణయించుకున్న దర్శకుడు.. రీసెంట్ గా రికార్డింగులు కూడా పూర్తి చేశాడు.

యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం పలు పాటలను పాడారు ఐశ్వర్య. ఒక డ్యుయెట్ తో పాటు ఒక ఫ్యామిలీ సాంగ్ ను కూడా ఆమెతో పాడించడం విశేషం. "తనతో ఎలాగైనా పాడించాలన్నది నా కోరిక. ఇప్పుడు అవకాశం ఇచ్చి పాడించాం. ఆ పాటలు చాలా బాగా వచ్చాయి. అందరికీ నచ్చుతాయి కూడా" అంటున్నాడు ఆక్సిజన్ దర్శకుడు జ్యోతికృష్ణ.