Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: జ్యోతో జ్యోతమ్మ జ్యోతీ
By: Tupaki Desk | 8 Jun 2015 7:45 AM GMTవ్యాంపు.. ఐటెమ్.. క్యారెక్టర్.. కాదేదీ నటనకనర్హం. ఈ ఫార్ములాలో ఒదిగిపోయిన తెలుగమ్మాయ్ జ్యోతి. వ్యాంపు పాత్రల నుంచి, ఐటెమ్ నంబర్ల నుంచి కీలకమైన క్యారెక్టర్ల వరకూ ప్రతి విషయంలోనూ పాపులర్ అయ్యింది. తమన్నా, అనుష్క, శ్రీయ వరుసలోనే తను కూడా దశాబ్ధం పైగానే కెరీర్‌ని సాగించింది. హీరోయిన్ అవ్వాలన్న అత్యాశకు పోకుండా తన రేంజికి తగ్గ పాత్రల్నే చేస్తూ పరిశ్రమలో నేను సైతం అంటూ కెరీర్ బండిని నడిపిస్తోంది.
ఇటీవలి కాలంలో కొన్ని పరిణామాలు తనని ఇబ్బందుల్లోకి నెట్టిన మాట వాస్తవం. అయినా కెరీర్‌ని తిరిగి ఎలా నిర్మించుకోవాలో తెలిసిన ఘరనా నటి జ్యోతి. ఇదిగో ఇటీవలి కాలంలో ఫోటోషూట్లతో విరుచుకుపడుతోందిలా. నలుపు తెలుపు కాంబినేషన్లో మోడ్రన్ అమ్మాయిలా, కాస్త ట్రెడిషనల్‌గా పంజాబీ డ్రెస్‌లో కనిపించింది. రకరకాల భంగిమల్లో జ్యోతి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కుర్రకారును వెర్రెత్తించేలా ఉన్నాయి. సినిమా పరిశ్రమలో అమ్మాయిలు ప్రవేశించడమే తప్పు అనుకుంటున్న నయా వరల్డ్‌లోకి ఎలానూ వచ్చింది. నిండా మునిగాక చలేంటి? అన్న చందంగా మహాసముద్రంలో మునక వేశాక ఇక తేలడం ఎలాగో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉంది ఈ భామ.