Begin typing your search above and press return to search.
లేడీ సింగం పవర్ సరిపోలేదా?
By: Tupaki Desk | 17 Aug 2018 8:15 AM GMTసింగం అనగానే సూర్యనే గుర్తుకొస్తాడు. ఆయన భార్య జ్యోతిక ఇప్పుడు లేడీ సింగం అవతారమెత్తింది. లేడీ పోలీసాఫీసర్ పాత్రలో తమిళంలో ఆమె చేసిన చిత్రం `నాకియర్`. అది తెలుగులో `ఝాన్సీ` పేరుతో విడుదలైంది. సినిమాలో అచ్చం సూర్యలాగే జ్యోతిక కూడా రెచ్చిపోయింది. పవర్ ఫుల్ ఫోలీసాఫీసర్ పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఆ పాత్ర - ఆ జోరు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. విజయశాంతి నుంచి ఎంతోమంది అలాంటి పాత్రలతో ఆకట్టుకున్నారు. పైగా రియలిస్టిక్ అప్రోచ్ తో సినిమాలు చేసే బాల... ఆ క్యారెక్టర్ కి పెద్దగా హీరోయిజాన్ని ఆపాదించలేదు. దాంతో ఆమె ఎంత హడావుడి చేసినా ఆ పాత్రలో పవర్ బయటికి రాలేదనేది ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న టాక్.
బూతులు మాట్లాడించినా - వాటిని సెన్సార్ బోర్డు బీప్ సౌండ్ లతో కప్పేసింది. దాంతో ఆ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. పోనీ కథైనా ఆకట్టుకుందా అంటే అది కూడా సగమే. ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసేలా చేయడంలో టాలీవుడ్ మంచి పరిణతి సాధించింది. `క్షణం` నుంచి మొదలుపెడితే అలాంటి సినిమాలు బాగానే కనిపిస్తాయి. `ఝాన్సీ` విషయంలో థ్రిల్లింగ్ అంశాలకి చోటున్నా వాటిపై పెద్దగా కసరత్తు చేయలేదు దర్శకుడు. సాగదీత ఎందుకనుకున్నట్టుగా అలా పైపైనే సన్నివేశాల్ని తీర్చిదిద్దడంతో థ్రిల్ కూడా పండలేదు. ఎటొచ్చి బాల స్టైల్ రియలిస్టిక్ ఎప్రోచే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. దానికితోడు ఒక చిన్న అంశంతో ఆకట్టుకొనే కథ చెప్పొచ్చనే విషయం ఈ చిత్రంతో రుజువైంది. వంద నిమిషాల నిడివిగల ఈ సినిమా - ఇదివరకటి బాల సినిమాలతో పోలిస్తే భిన్నంగా అనిపిస్తుంది. శాడ్ ఎండింగ్ లేకుండా శుభం కార్డు వేసి బాల ఇలాంటి సినిమాలు కూడా తీస్తాడనే ఓ సంకేతాన్ని పంపాడు దర్శకుడు.