Begin typing your search above and press return to search.
జ్యోతిక విశ్వరూపం రెడీ!
By: Tupaki Desk | 24 July 2018 6:55 AM GMTమనకు పరిచయం తక్కువే కానీ మాజీ హీరోయిన్ గా హీరో సూర్య భార్యగా జ్యోతికకు ఉన్న ఫాలోయింగ్ కోలీవుడ్ లో భారీగా ఉంది. తెలుగులో చిరంజీవి సరసన ఠాగూర్ లాంటి సినిమాల్లో నటించినా తమిళ అవకాశాల వల్ల ఇక్కడ ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది జ్యోతిక. సూర్యను వివాహం చేసుకున్నాక చాలా గ్యాప్ తీసుకున్న జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా మొదలుపెట్టేసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తమిళ్ లో దూసుకుపోతోంది. కాకపోతే అవి మన దాకా రావడం లేదు. అందులో మొదటిది బాలా దర్శకత్వంలో రూపొందిన నచియర్ తెలుగులో ఝాన్సీగా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. చాలా నాటుగా సహజత్వంతో ఉట్టి పడే సినిమాలు తీస్తాడని పేరున్న బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్కడ మంచి విజయాన్నే అందుకుంది. ఏ మాత్రం మానవత్వం లేకుండా తప్పు చేసిన వాళ్ళ మీదకు విరుచుకుపడే ఊర మాస్ పోలీస్ గా జ్యోతిక పెర్ఫార్మన్స్ కు భారీ స్పందన దక్కింది.
ఇందులో హీరో జివి ప్రకాష్. ఆ మధ్య పెన్సిల్ లాంటి సినిమాలతో తెలుగులో కనిపించాడు కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. తన కన్నా జ్యోతిక పేరు మీదే ఈ సినిమా బాగా మార్కెట్ అవుతోంది. దీంతో పాటు జ్యోతిక నటించిన మరో సినిమా మగలీర్ ముట్టుమ్ కూడా దబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విద్యా బాలన్ మూవీ తూమారి సుల్లుని జ్యోతికతోనే రీమేక్ చేస్తున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న అందులో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కూడా తెలుగులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి స్ట్రెయిట్ సినిమాల ద్వారా కాకపోయినా ఇలా డబ్బింగ్ రూపంలో తెలుగులో సైతం జ్యోతిక కం బ్యాక్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ఝాన్సీ ఎలాంటి బోణీ కొట్టిస్తుందో చూడాలి.