Begin typing your search above and press return to search.
సూర్య కున్న లేడీ ఫాలోయింగ్ వల్ల నాకు ఒత్తిడి కొంచెం ఎక్కువే: జ్యోతిక
By: Tupaki Desk | 3 Nov 2021 3:16 AM GMTప్రేక్షకుల్లో స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక కు ఉండే క్రేజ్ - ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్ లో కలిసి నటించిన ఈ జంట.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక.. సెకండ్ ఇన్నింగ్స్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతోంది. మరోవైపు హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బాధ్యతలు కూడా చూసుకుంటోంది. సూర్య - జ్యోతిక కలిసి నిర్మించిన 'జై భీమ్' సినిమా.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను జ్యోతిక వివరించారు.
ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయడం గురించి మాట్లాడుతూ.. ''థియేటర్లలోనే చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి.. పెద్ద స్క్రీన్ కు అతీతంగా చెప్పే కథలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని ఓటీటీలో చూడొచ్చు. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ - థియేటర్స్ అనేవి పేజీకి ఒకే వైపు అన్నట్టు మారిపోయాయి. ఇప్పుడు మా బ్యానర్ లో పదిహేను సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో కొన్ని థియేటర్లలో మరికొన్ని ఓటీటీలకు సరిపోయే కథలు ఉన్నాయి'' అని జ్యోతిక చెప్పారు.
''సూర్య నేనూ కథల విషయంలో చాలా ట్రాన్స్ పెరెంట్ గా ఉంటాం. వాటి గురించి ఎక్కువగా చర్చిస్తాం. సూర్య అంత తేలిగ్గా ఏదీ కన్విన్స్ అవ్వరు. నేను కథ వినగానే కొత్తగా ఉందా లేదా అని మాత్రం చూస్తాను. చాలా వరకు ఫైనల్ గా నా మాటకే అందరూ ఓటు వేస్తారు. కథలో కొత్తదనం ఉంటే మేకర్స్ ఎక్కడి వారు అనేది మేము అసలు పట్టించుకోవడం లేదు. కథలో కొత్తదనం ఉంటే వెంటనే మేము ఓకే చేస్తాం. వాస్తవ సంఘటనలకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే జనాలను ఆకట్టుకునే చేసే సబ్జెక్టులవుతాయి. నేను రీసెంట్ గా చేసిన 'ఉడన్పిరప్పే' సినిమా కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిందే'' అని జ్యోతిక వివరించారు.
తన భర్త సూర్య గురించి మాట్లాడుతూ.. ''సూర్య చాలా రొమాంటిక్ హస్బెండ్. నన్నూ పిల్లలను బాగా చూసుకుంటారు. ప్రొడక్షన్ హౌస్ లో నా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు. నాకు నచ్చిన సినిమాలను ఎంకరేజ్ కూడా చేస్తారు. భార్య మాటకు వాల్యూ ఇస్తారు. నాతో కూర్చొని ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగుతారు. ఇవన్నీ చాలా మంచి విషయాలు'' అని జ్యోతిక తెలిపారు. సూర్య కు లేడీ ఫాలోయింగ్ ఉండటం వల్ల తనకు ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంటుందని జ్యోతిక నవ్వుతూ చెప్పుకొచ్చింది.