Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ల గురువుకే ఇంత కష్టమా?
By: Tupaki Desk | 12 Feb 2018 2:55 PM GMTతమిళ విఖ్యాత దర్శకులు దివంగత బాల చందర్ గారి ఆస్తులు వేలానికి వచ్చాయన్న వార్త కోలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. ఆయన చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు పలు అప్పులు చేయాల్సి వచ్చిందని, దానికి తోడు కవితాలయ సంస్థ పేరు మీద తీసిన పలు సినిమాలు, సీరియళ్ళు పరాజయం పాలు కావడం వల్ల అది మరింత భారంగా మారి ఈ పరిస్థితి వచ్చిందని తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. యుకో బ్యాంక్ ఇచ్చిన ప్రకటన ప్రకారం 1.36 కోట్ల కనీస ధరావతు ధరతో ఇల్లు, ఆఫీస్ వేలం వేయబోతున్నాం అని ఉంది. ఎలా చూసుకున్నా వేలానికి చెప్పిన మొత్తం చాలా చాలా తక్కువ. బాల చందర్ గారు ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా ఉండి అంత తక్కువ మొత్తానికే తన విలువైన ఆస్తులు తాకట్టు పెట్టరా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తమిళనాట రజనికాంత్ - కమల్ హాసన్ లకు సినిమా జీవితాన్ని ప్రసాదించిన గురువుగా ఆయనకు యెనలేని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ ఇద్దరు ఇప్పుడు రాజకీయాలను శాసించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ మొత్తం వాళ్ళకు అసలు లెక్కలోకే రాదు. మరి ఇది విని వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. బాల చందర్ గారు వీళ్ళకే కాకుండా ప్రకాష్ రాజ్ లాంటి ఎందరో నటులకు చేయి పట్టి నడిపించి గొప్ప భవిష్యత్తు అందించారు. వాళ్ళలో ఏ ఒక్కరు కదిలినా ఆయన ఆస్తులు సురక్షితంగా ఉంటాయి.
దీని మీద కోలీవుడ్ మీడియాలో పలు కథనాలు ఆధారాలతో సహా ప్రచురితమయ్యాయి.నడిగర్ సంఘం కూడా దీన్ని విశ్లేషించే పనిలో ఉంది. నిజాలు వెల్లడయ్యాక దీని గురించి స్పందిస్తానని విశాల్ అన్నట్టు టాక్. ఒకవేళ నిజమైతే మాత్రం నడిగర్ సంఘం తరఫునే అప్పు తీర్చి ఆయన కుటుంబ సభ్యులకు సురక్షితంగా అవి అప్పజెప్పలనే ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. దీని గురించి పూర్తి స్పష్టత రావడానికి మరి కొద్ది రోజులు పట్టొచ్చు. ఏదేమైతేనేం గురువు ఋణం తీర్చే సమయం వచ్చినప్పుడు స్పందించినవాడే నిజమైన శిష్యుడు. మరి అలా ఎవరు మిగులుతారో.