Begin typing your search above and press return to search.

బాహుబలి టీం మెంబరే కావాలి

By:  Tupaki Desk   |   29 Jan 2018 6:21 AM GMT
బాహుబలి టీం మెంబరే కావాలి
X
యంగ్ హీరోల్లో నిఖిల్ ప్రతి సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. స్వామిరారా సినిమాతో మొదలైన సెకండ్ ఇన్నింగ్స్ నుంచి రొటీన్ కు భిన్నంగా ఉండే సబ్జెక్టులనే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా చేస్తున్న కిర్రాక్ పార్టీ విడుదలకు సిద్ధమవుతోంది.

కిర్రాక్ పార్టీ సినిమా పనులు దాదాపుగా పూర్తవడంతో నిఖిల్ తరవాత సినిమా తమిళ దర్శకుడు టి.ఎన్.సంతోష్ డైరెక్షన్ లో చేయడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ సంతోష్ తమిళంలో తీసిన యాక్షన్ బేస్ డ్ థ్రిల్లర్ మూవీ కణితన్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులోనే ప్రేక్షకులు థ్రిల్లయ్యే అంశాలు చాలానే ఉండటంతో ఈ రీమేక్ లో నటించడానికి ఒప్పుకున్నాడు. దీనికి సినిమాటోగ్రాఫర్ గా కె.కె.సెంథిల్ కుమార్ ను డైరెక్టర్ ఏరికోరి తీసుకుంటున్నాడు. బాహుబలి తరవాత సెంథిల్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయినా కణితన్ రీమేక్ లో సినిమాటోగ్రాఫర్ పాత్ర కీలకం కావడం.. ఓ రకంగా ఛాలెంజింగ్ టాస్క్ కావడంతో ప్రత్యేకంగా సెంథిల్ ను ఎంచుకున్నారని తెలుస్తోంది. దీనికి సెంథిల్ కూడా ఓకే అన్నాడనేది లేటెస్ట్ న్యూస్.

ఈ మధ్య అన్నీ స్ట్రయిట్ చిత్రాలతోనే హిట్లు కొట్టిన నిఖిల్ ఇప్పుడో రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నాడు. నిఖిల్ తాజాగా నటించిన కిర్రాక్ పార్టీ కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులోకి తీసుకొస్తున్నారు. దీని తరవాత ఓకే చెప్పింది రీమేక్ లోనే. ఈ రీమేక్ లు ఇక్కడి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి మరి.