Begin typing your search above and press return to search.

బిఏ రాజుపై కె.రాఘ‌వేంద్ర‌రావు ఎమోష‌న‌ల్ మెసేజ్

By:  Tupaki Desk   |   22 May 2021 10:01 AM GMT
బిఏ రాజుపై కె.రాఘ‌వేంద్ర‌రావు ఎమోష‌న‌ల్ మెసేజ్
X
టాలీవుడ్ దిగ్గ‌జ‌ పీఆర్వో - నిర్మాత బిఏ రాజు ఆక‌స్మిక మ‌ర‌ణంపై ప‌రిశ్ర‌మ తీవ్ర దిగ్భ్రాందికి గురైంది. చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్‌- మ‌హేష్‌-ఎన్టీఆర్ - ప్ర‌భాస్-బ‌న్ని- ర‌కుల్ స‌హా ప్ర‌ముఖులెంద‌రో ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.

బి.ఏ.రాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో షేర్ చేసుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని..సినిమాల‌ కలెక్షన్స్ ట్రేడ్ రిపోర్ట్ రికార్డుల గురించి యథాతథంగా చెప్పగల గొప్ప నాలెజ్ బ్యాంక్.. ఎన్ సైక్లో పెడియా అంటూ మెగాస్టార్ ఎంతో ఎమోష‌న‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా కె.రాఘ‌వేంద్ర‌రావు తీవ్ర సంతాపాన్ని తెలియజేసారు.``బి ఏ రాజు… నువ్వు లేని తెలుగు సినిమా మీడియా.. పబ్లిసిటీ.. ఎప్పటికీ లోటే… తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను`` అని సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.

మాలీవుడ్ నుంచి దుల్కార్ స‌ల్మాన్ త‌న సంతాపం తెలియ‌జేశారు. ప‌రిశ్‌ర‌మ అగ్ర క‌థానాయిక‌లు అనుష్క‌- కాజ‌ల్ -త‌మ‌న్నా- స‌మంత - కియ‌రా త‌దిత‌రులు బీఏ రాజుకు సంతాపం తెలియ‌జేశారు.