Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడు కోలుకున్నారు!!!

By:  Tupaki Desk   |   13 Aug 2015 5:09 AM GMT
దర్శకేంద్రుడు కోలుకున్నారు!!!
X
దేశంలోనే నెం.1 సినిమా (బాహుబలి) నిర్మించింది ఆర్కామీడియా సంస్థ. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని రికార్డుల్ని తిరగరాసి ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది బాహుబలి. అయితే ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ ఎవరని అనుకుంటున్నారు? ఆర్కామీడియా అధినేత శోభు యార్లగడ్డ అన్నది నిజమే. ఆయనే పెట్టుబడులు పెట్టారు. అయితే అతడి వెన్నంటి ఉండి సమస్తం నడిపించింది మాత్రం మామగారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.

శతాధిక చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్రరావు అసాధారణమైన ఆలోచన నుంచే ఈ సినిమా పుట్టిందంటే అతిశయోక్తి కాదు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆయన శిష్యుడు. కాబట్టి రాఘవేంద్రరావు ఆదేశాల మేరకే ఈ సినిమాకి సన్నాహాలు సాగాయి. హిస్టరీని రిపీట్‌ చేసే సినిమా ఒకటి తీయాలి. అది టాలీవుడ్‌ పేరు నిలబెట్టాలని రాఘవేంద్రుడే సూచించారు. అందుకు తగ్గట్టే అల్లుడు శోభు యర్లగడ్డ భారీగా పెట్టుబడుల్ని సమీకరించి రాజమౌళిని రంగంలోకి దించి, విజయేంద్ర ప్రసాద్‌ వద్ద కథని తీసుకుని, కీరవాణి బాణీలతో ముందుకు సాగారు.

అలా ఆన్‌ సెట్స్‌ కి వెళ్లిన బాహుబలి ఆ తర్వాత రకరకాల మలుపులు తీసుకుంది. తొలుత ఈ చిత్రాన్ని ఒకే చిత్రంగా తెరకెక్కించాలని అనుకున్నా రెండు భాగాలుగా డివైడ్‌ చేయాల్సొచ్చింది. తొలిభాగం పెద్ద హిట్టయ్యింది. ఈ విజయాన్ని రాఘవేంద్రుడు కనులారా వీక్షించారు. అయితే అతడి వయసు రీత్యా ఇటీవలే కాసింత అస్వస్థత చేసిందని చెబుతున్నారు. కారణం ఏదైనా రాఘవేంద్రరావు ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారని శోభు యార్లగడ్డ తెలిపారు.

కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చివరి సినిమా 'ఝుమ్మంది నాదం'. ఈ సినిమా తర్వాత మోహన్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారని వార్తలొచ్చాయి. ఇటీవలే గోదావరి పుష్కరాల్లో పుష్కర స్నానమాచరిస్తూ మీడియా కంటికి చిక్కారు. అప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ హఠాత్తుగా నీరసపడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని శోభు కన్‌ ఫమ్‌ చేశారు.